అత్తారింటికి అర్ధరాత్రి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త.. భార్యాపిల్లలు సహా అయిదుగురు సజీవ దహనం..!

ABN , First Publish Date - 2022-10-18T23:37:24+05:30 IST

ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే కూతురు బాగుండాలనే ఉద్దేశంతో తండ్రి ఇటీవలే ఆమెకు రెండో..

అత్తారింటికి అర్ధరాత్రి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త.. భార్యాపిల్లలు సహా అయిదుగురు సజీవ దహనం..!
ప్రతీకాత్మక చిత్రం

ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. దీంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే కూతురు బాగుండాలనే ఉద్దేశంతో తండ్రి ఇటీవలే ఆమెకు రెండో వివాహం చేశాడు. తన కూతురు, మనువడు, మనువరాలు.. సంతోషంగా ఉంటారని అనుకున్నాడు. కానీ రెండో భర్త మాత్రం ఆమెపై ఏమాత్రం ప్రేమ చూపించేవాడు కాదు. పిల్లలను వదిలి రావాలంటూ కండీషన్ పెట్టేవాడు. అందుకు ఒప్పుకోని భార్యపై కోపం పెంచుకున్నాడు. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి అత్తగారింటికి వెళ్లి.. ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్యా పిల్లలు సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


పంజాబ్ (Punjab) జలంధర్ పరిధి మొహత్‌పూర్ పట్టణానికి చెందిన సుర్జన్ సింగ్ అనే వ్యక్తికి భార్య, పరమ్‌జిత్ కౌర్‌ అనే కుమార్తె ఉన్నారు. సుర్జన్ సింగ్ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కూతురికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశాడు. అయితే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త మృతి చెందాడు. దీంతో కొడుకు గుర్మోహన్, కూతురు అర్ష్‌దీప్ కౌర్‌తో కలిసి పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి సుర్జన్ సింగ్.. కూతురు, మనువడు, మనువరాలిని ఎంతో బాగా చూసుకునేవాడు. అయితే కూతురు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏడాది క్రితం ఖురాసైద్‪‌పూర్ గ్రామానికి చెందిన కుల్‌దీప్ సింగ్ అలియాస్ కల్లు అనే వ్యక్తికి కూతురును ఇచ్చి వివాహం చేశాడు. ఇక తన కూతరు భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావించాడు.

డెలివరీ అయిన 16 రోజుల్లోనే తల్లీకూతుళ్లు మృతి.. అనుమానంతో ఆ భర్తను నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని..


అయితే భార్యను కొన్నాళ్లు బాగా చూసుకున్న కుల్‌దీప్ సింగ్.. తర్వాత వేధించడం మొదలెట్టాడు. పిల్లలను వదిలి తన వద్ద ఉండాలంటూ కండీషన్ పెట్టాడు. అయితే ఇందుకు ఆమె ఏమాత్రం ఒప్పుకోలేదు. పిల్లల భవిష్యత్ కోసమే రెండో పెళ్లి చేసుకున్నానని.. అలాంటి పిల్లలను ఎలా వదులుకుంటానని భర్తను నిలదీసింది. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకునేవి. ఇటీవల భర్త వేధింపులు భరించలేక పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్యపై కోపం పెంచుకున్నాడు. సోమవారం అర్ధరాత్రి అత్తగారి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అంతా నిద్రిస్తుండగా.. పెట్రోల్ పోసి నిప్పించాడు. తలుపులు మూసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో భార్య పరమ్‌జిత్, ఆమె కొడుకు గుర్మోహల్, కుమార్తె అర్ష్‌దీప్, మామ సర్జన్ సింగ్, అత్త జాంగిద్రో అంతా సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న కుల్దీప్ సింగ్ కోసం గాలిస్తున్నారు.

స్నేహితుడి ప్రియురాలితో ఫోన్లో మాట్లాడటమే ఆ యువకుడి పాలిట శాపమయింది.. అతడు కలలో కూడా ఊహించని రీతిలో..!



Read more