-
-
Home » Prathyekam » Father killed 3 daughters commits suicide sgr spl-MRGS-Prathyekam
-
స్కూలు నుంచి ముగ్గురు కూతుళ్లను నేరుగా ఇంటికి కాకుండా రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లి.. ఓ తండ్రి దారుణమిది..!
ABN , First Publish Date - 2022-08-17T22:19:06+05:30 IST
ఆ వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లను స్కూలుకు వెళ్లి పికప్ చేసుకున్నాడు..

ఆ వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లను స్కూలుకు వెళ్లి పికప్ చేసుకున్నాడు.. ముగ్గురినీ బైక్ పై ఎక్కించుకుని బయల్దేరాడు.. వారిని ఓ రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకెళ్లాడు.. ముగ్గురునీ ఓ గూడ్సు రైలు కిందకు తోసేసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఉజ్జయినిలో ఈ ఘటన జరిగింది. ఉజ్జయిని-నాగ్డా రైల్వే ట్రాక్‌పై ఈ రోజు (బుధవారం) ఉదయం 11 గంటలకు రైల్వే ట్రాక్‌పై నలుగురి మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
Madhya Pradesh: ప్రియుడు తెచ్చిన విషాన్ని నీళ్లల్లో కలిపి భర్తకు ఇచ్చా.. అందుకే చనిపోయాడని ఆ భార్య చెప్పినా పోలీసులు మాత్రం..
ఉజ్జయినికి చెందిన రవి పంచాల్ (35), అతని కుమార్తెలు అనామిక (12), ఆరాధ్య (8), అనుష్క (7)ల మృతదేహాలు బుధవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై పడి ఉన్నాయి. కూతుళ్లను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు రవి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. వారిని స్కూల్ నుంచి పికప్ చేసుకుని నేరుగా రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. అక్కడ కూతుళ్లను గూడ్సు రైలు కిందకు తోసేసి ఆ తర్వాత తను కూడా అదే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 9.20 గంటలకు ఈ ఘటన జరిగిందని గూడ్స్ రైలు లోకో పైలట్ తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో రవి వివాహేతర సంబంధం గురించి బయటపడింది. రవికి పక్క గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయమై ఇంట్లో భార్యతో తరచుగా గొడవలు జరుగుతుండేవి. పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోతానని భార్య తరచుగా రవిని బెదిరించేది. దీంతో రవి తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు బయటపెడతామని పోలీసులు తెలిపారు.