వేడుకలో విషాదం: వేదికపై కుప్పకూలిన హనుమంతుని పాత్రధారి

ABN , First Publish Date - 2022-10-03T16:17:25+05:30 IST

యూపీలోని ఫతేపూర్ జిల్లాలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం...

వేడుకలో విషాదం: వేదికపై కుప్పకూలిన హనుమంతుని పాత్రధారి

యూపీలోని ఫతేపూర్ జిల్లాలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. సాంస్కృతిక కార్యక్రమంలో హనుమంతుని వేషం ధరించిన వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హనుమంతుని పాత్రధారి మృతితో కార్యక్రమాన్ని అర్థాంతరంగా నిలిపివేసి, పోలీసులకు సమాచారాన్ని అందించారు. మరణించిన వృద్ధునికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా ఆ వృద్ధుడు గత 20 ఏళ్లుగా గ్రామంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. 


వివరాల్లోకి వెళితే సులేమ్‌పూర్ గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనిలో హనుమంతుని పాత్రధారి రామ్ స్వరూప్(65) వేదికపై ఉన్నట్టుండి కళ్లుతిరిగి పడిపోయాడు. వెంటనే అక్కడున్నవారు పరిశీలించగా, అతను మృతి చెందాడని స్పష్టమయ్యింది. దీంతో ఆ వృద్ధునికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇది జరిగిన తరువాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా రామ్ స్వరూప్ గ్రామంలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పండుగల సందర్భాలలో నాటకాలలో వేషాలు వేసేవాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.  

Read more