-
-
Home » Prathyekam » fate of the cleaning worker changed overnight in prvn spl-MRGS-Prathyekam
-
Viral News: ఎంతో అదృష్టం ఉంటేగానీ ఇలా జరగదు.. కేవలం రూ.100 నోటును జేబులో పెట్టుకుని బయటికెళ్తే.. రూ.50లక్షలు..
ABN , First Publish Date - 2022-09-08T18:05:42+05:30 IST
అతడు ఒక స్వీపర్. కొన్నేళ్లుగా ఇదే పని చేస్తూ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. ఇన్నాళ్లకు అతడిని అదృష్టం వరించింది. దీంతో కొన్ని లక్షలకు అతడు అధిపతి అయ్యాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా హాట్ టాపి

ఇంటర్నెట్ డెస్క్: అతడు ఒక స్వీపర్. కొన్నేళ్లుగా ఇదే పని చేస్తూ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. తాజాగా అతడిని అదృష్టం వరించింది. దీంతో కొన్ని లక్షలకు అతడు అధిపతి అయ్యాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇంతకూ అతడు ఎవరు? లక్షధికారి ఎలా అయ్యాడు? అనే పూర్తి వివరాల్లోకి వెళిత..
టార్సమ్ లాల్(Tarsem Lal) అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితమే రాజ్‌రాణి(Rajrani ) అనే మహిళతో వివాహం జరిగింది. అతడు పంజాబ్‌లో స్వీపర్(sweeper)గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్థిక పరిస్థుల వల్ల చదువుకోలేపోయిన అతడు.. జీవితాంతం పేదరికంలోనే బతకాలని అనుకోలేదు. ఈ క్రమంలోనే తన అదృష్టాన్నే నమ్ముకుని.. గత 25ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడిని తాజాగా అదృష్టం వరించింది. అతడు నివాసం ఉన్న ప్రాంతంలో ఉన్న ఓ దుకాణంలో కొనుగోలు చేసిన పంజాబ్ స్టేట్ లాటరీ టికెట్(Punjab state lottery ticket)కు జాక్‌పాట్ తగిలింది. లక్కీ డ్రాలో ఏకంగా రూ.50లక్షలు గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా టార్సమ్‌కు లాటరీ టికెట్ అమ్మిన సంజీవ్ కుమార్ మాట్లాడాడు. గత 25ఏళ్లుగా టార్సమ్ తన వద్దే లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పాడు. తాజాగా అతడు లాటరీ టికెట్ కొనుగోలు చేసే సమయానికి.. టార్సమ్ జేబులో కేవలం రూ.100 మాత్రమే ఉన్న విషయాన్ని తాను గుర్తించినట్టు తెలిపాడు.
ఇదిలా ఉంటే.. రూ.50లక్షలు గెలుచుకోవడంపట్ల టార్సమ్ సంతోషం వ్యక్తం చేశాడు. గెలుచుకున్న డబ్బుతో తన కూతురు పెళ్లి చేయడంతోపాటు, కొడుకుకు వ్యాపారం పెట్టిస్తానన్నాడు. ఇంకొంత మొత్తాన్ని వృద్ధాప్య ఖర్చుల కోసం దాచుకుంటానన్నాడు. డబ్బులు గెలుచుకున్నప్పటికీ.. ఎప్పటిలాగే స్వీపింగ్ వర్క్‌కు వెళ్తానని స్పష్టం చేశాడు.