-
-
Home » Prathyekam » Famous heritage structures in Himachal Pradesh are Kath Kuni houses ssd-MRGS-Prathyekam
-
Kath Kuni: హిమాచల్ ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన వారసత్వ నిర్మాణాలు కాత్ కుని ఇళ్ళు..!
ABN , First Publish Date - 2022-09-30T14:40:41+05:30 IST
పర్వతాలకు నిలయమైన హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాల్లో ఒకటి.

పర్వతాలకు నిలయమైన హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాల్లో ఒకటి. ఇక్కడి కాత్ కుని నివాసాలను హిమాచల్ లోని అత్యంత సాంప్రదాయమైన ఇళ్ళుగా భావిస్తారు. ఇవి అక్కడ లభించే వనరులతో నిర్మించారు. కాత్ అంటే కలప అని, కుని అంటే రాళ్లు అనే అర్థం వస్తుంది.
ఈ సాంప్రదాయ కాత్ కుని ఇళ్ళు కాలంతో వచ్చే చాలా వాతావరణ మార్పులను ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని స్థిరంగా నిలబడ్డాయి. వాటి బలానికి ప్రధాన కారణం రాతితో, కలపతో రాతిపొరల నిర్మాణమే కారణం. ఇది రెండు లేయర్ల నిర్మాణం. ఈ రాతి నిర్మాణంలోని ముఖ్యమైన విషయం ఏమిటంటే శీతాకాలంలో ఇంటిని వెచ్చగా ఉంచుతుంది. అదే వేసవిలో చల్లగా ఉంచి ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తుంది. ఈ కట్టణంలో వాడిన రాతి ముక్కల కారణంగా ఏర్పడిన ఖాళీల వల్ల భూకంపాల సమయంలో ఇంటికి ఎటువంటి ప్రమాదం జరగదు. స్థిరంగా నిలిచే ఉంటాయి.
కాత్ కుని ఆర్కిటెక్చర్ గృహాల నిర్మాణంలో రైతులు పశువులను దిగువ అంతస్తులో పెంచుతారు. ఇక రెండవ అంతస్తును ధాన్యాగారంగా ఉపయోగిస్తారు. ఈ దిగువ అంతస్తులో శీతాకాలం కోసం ఆహారాన్ని నిల్వ ఉంచుతారు. పగటిపూట సూర్యరశ్మిని గ్రహించడానికి ఇంటి ప్రధాన గోడల నుంచి కాంటిలీవర్ తో నిర్మించారు. హిప్ రూఫ్ లు ఉపయోగించారు. ఇక్కడి దేవాలయాల నిర్మాణంలో ఆ పద్దతులను చూడవచ్చు. ఆర్కిటెక్చర్ కు ఉదాహరణగా ఇక్కడి హస్తకళను అలంకార రూపంలో, డిజైన్ లలో వివరంగా ప్రదర్శించారు. గోడలు, ఫ్లోరింగ్, కిటికీలు, డిజైన్ లో ఇది ఉంటుంది.
కాత్ కుని నిర్మాణాలతో ప్రయోజనాలు...
1. సుస్థిరమైనవి.
2. స్థానికంగా లభించే వనరులతో నిర్మించారు.
3. భూకంపం ప్రాంతాలకు అనుకూలం.
4. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఇన్సులేట్ చేస్తుంది.
5. శక్తి సమర్థవంతమైన నిర్మాణాల వల్ల చేతివృత్తుల వారు,. రైతులు, జీవనోపాధికి సహాయపడతాయి.
ఈ పొరలు కూడా ఇంటి గోడలకు ఒక అందమైన ఆకృతిని ఇస్తాయి. ఈ ఇంటి బాల్కనీలు చెక్కతో చేయబడి అందంగా కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు కాలంతో పాటు వచ్చిన మార్పుతో ఇప్పటి ఇళ్ళను ఇటుక, సిమ్మెంట్ తో నిర్మించడం వల్ల అక్కడి పురాతన సాంప్రదాయానికి కాలం చెల్లిందని తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ కు పర్యాటనకు వచ్చే సందర్శకుల్లో ఇదే అభిప్రాయం కలుగుతుంది.
అక్కడి ప్రభుత్వం ఇళ్ళకు చెక్కను వాడడాన్ని నిషేదించింది. దీనితో కాత్ కుని ఇళ్ళ నిర్మాణం ఆగిపోయింది. హిమాచల్ స్థానిక సమాజాలు అభివృద్ధి నీడలో జారిపోతున్న వారసత్వం, సంప్రదాయాల ఫలితంగా అక్కడి ఇళ్ళు రూపాన్ని మార్చుకున్నా బహిరంగ ప్రదేశాల్లో అక్కడక్కడా కాత్ కుని నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి హిమాచల్ ప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని పురాతన సాంప్రదాయాన్ని కాపాడతాయి. అక్కడి ప్రజలకు వీటిని కాపాడుకునే అవసరం చాలా ఉంది.