Viral News: వామ్మో.. పాములతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబం .. రెండు గదులు కూడా కేటాయించేశారు.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2022-10-05T16:54:51+05:30 IST

పాములు కంట పడితే.. కొందరు వణికిపోతారు. అక్కడి నుంచి దూరంగా పారిపోతారు. కానీ ఓ కుటుంబం మాత్రం.. కొన్నేళ్లుగా పాములతోపాటే నివాసం ఉంటున్నారు. అంతేకాదు వాటికి వారానికి రెండుసార్లు పూజలు కూడా చేస్తున్నారు. వినడాని

Viral News: వామ్మో.. పాములతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న కుటుంబం .. రెండు గదులు కూడా కేటాయించేశారు.. ఎక్కడంటే..

ఇంటర్నెట్ డెస్క్: పాములు కంట పడితే.. కొందరు వణికిపోతారు. అక్కడి నుంచి దూరంగా పారిపోతారు. కానీ ఓ కుటుంబం మాత్రం.. కొన్నేళ్లుగా పాములతోపాటే నివాసం ఉంటున్నారు.  అంతేకాదు వాటికి వారానికి రెండుసార్లు పూజలు కూడా చేస్తున్నారు. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ప్రస్తుతం స్థానికంగా వైరల్ అవుతున్న ఈ న్యూస్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో నిలిమరి గ్రామం ఉంది. ఈ గ్రామంలోని నీలకంఠ భూమియా కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా నాగు పాములతోపాటే ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా పాములు ఆ కుటుంబ సభ్యులకు హాని చేయలేదు. ఇంట్లో మొత్తం ఐదు గదులు ఉండగా.. వాటిలోని రెండు గదుల్లో పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. ఈ పుట్టలకు కుటుంబ సభ్యులు వారంలో రెండు రోజులు (సోమవారం, మంగళవారం) పూజలు నిర్వహించి, పాలు పోస్తున్నారు. పెళ్లికి ముందు ఈ పూజలు తానే చేసేదానినని నీలకంఠ కూతురు లక్ష్మి కబసి పేర్కొన్నారు. వివాహానంతరం తన పుట్టింటి వాళ్లే ఆ పూజలు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు అందులోని నాగుపాములు తమకు హాని చేయలేదన్నారు. కాగా.. ఈ విషయం తెలిసి స్థానికులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఇంటిని పాముల ఇల్లుగా పిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిపుణులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములతో కలిసి నివసించడం ప్రమాదకరంగా పేర్కొంటున్నారు. పాములు పాలు తాగవని.. మూడనమ్మకాలు వీడాలని చెబుతున్నారు. 
Read more