ఏడాది క్రితం పరిచయం, ఆపై పెళ్లి.. చివరకు అతనికి ఎలాంటి షాక్ తగిలిందంటే..

ABN , First Publish Date - 2022-03-18T05:51:43+05:30 IST

అతను ఓ లారీ డ్రైవర్.. ఏడాది క్రితం అతనికి ఓ మహిళ పరిచయమైంది.. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు...

ఏడాది క్రితం పరిచయం, ఆపై పెళ్లి.. చివరకు అతనికి ఎలాంటి షాక్ తగిలిందంటే..

అతను ఓ లారీ డ్రైవర్.. ఏడాది క్రితం అతనికి ఓ మహిళ పరిచయమైంది.. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు.. అయితే వివాహం జరిగిన 13 రోజుల తర్వాత ఆమె భర్త ఇంట్లోని డబ్బులు, బంగారం తీసుకుని పారిపోయింది.. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె బండారం బయటపడింది.. 


రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో మాపురి గ్రామానికి చెందిన రామారామ్ అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఏడాది క్రితం జియో దేవి అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ వివాహం చేసుకుని సంసార జీవితాన్ని ప్రారంభించారు. అయితే పెళ్లి జరిగిన 13 రోజుల తర్వాత రామారామ్‌కు ఇంట్లో నుంచి డబ్బులు, నగలు తీసుకుని జియో దేవి పరారైంది. దీంతో రామారామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


అక్కడ షాకింగ్ విషయం బయటపడింది. అప్పటికే జియో దేవికి వివాహమైందని, ఆమెపై ఇలాంటి కేసులు 3 నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. మరో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అంతే కాకుండా జియో దేవి ఇప్పటి వరకు ఇలాంటి దొంగ వివాహాలు 13 సార్లు చేసుకుందని తెలిసింది. వారిలో కొందరిపై జియోదేవి గృహ హింస కేసుల కూడా పెట్టి.. చివరికి వారి వద్ద భారీ మొత్తంలో డబ్బులు తీసుకుందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read more