పనికిరాని కోడి ఈకలతో అద్భుత వ్యాపారం... కోట్లలో టర్నోవర్!

ABN , First Publish Date - 2022-09-28T16:13:35+05:30 IST

చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయడం గురించి...

పనికిరాని కోడి ఈకలతో అద్భుత వ్యాపారం... కోట్లలో టర్నోవర్!

చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయడం గురించి మనకు తెలిసిందే. అయితే చెత్తతో ఉత్పత్తి చేసే దుస్తుల గురించి మీరు ఎప్పుడూ వినివుండరు. ఎవరూ ముట్టుకునేందుకు కూడా ఇష్టపడని కోడి ఈకలతో మెత్తని దుస్తులను తయారు చేస్తున్నారంటే మీరు నమ్మగలరా? అవును. ఇది నిజం. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దంపతులు ముదిత, రాదేష్ దీనిని చేసి చూపించారు.


వీరికి కాలేజీ రోజుల్లో వచ్చిన ఒక ఐడియాకు కార్యరూపం తీసుకువచ్చారు. ఇప్పుడు వీరి కంపెనీ టర్నోవర్ కోట్ల రూపాయలకు చేరుకుంది. ముదిత అండ్ రాజేష్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ముదిత మాట్లాడుతూ తాను రాధేష్‌తో పాటు ఎంఏ చదువుకుంటున్న రోజుల్లో చెత్తతో ఉత్పత్తులు చేసే ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఈ నేపధ్యంలోనే కోడి ఈకలతో ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. దీనిపై పలు పరిశోధనలు చేసి, వస్త్రాన్ని తయారు చేసే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. 16 వేల రూపాయలతో దీనిని ప్రారంభించామని, గడచిన రెండున్నరేళ్లలో రూ. 7 కోట్ల బిజినెస్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ. 2.5 కోట్ల టర్నోవర్ ఉన్నదన్నారు. కోఢి ఈకల ద్వారా ఉత్సత్తి చేసే ఈ వస్త్రం సహజసిద్ధంగా లభించే ఫైబర్ అని తెలిపారు. కోడి ఈకలతో రూపొందించే శాలువాలకు మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు. పట్టణంలో లభ్యమయ్యే కోడి ఈకలను సేకరించి తాము వస్త్రాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2022-09-28T16:13:35+05:30 IST

Read more