Cyber Crime: వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడినందుకు రూ.25 లక్షలు మాయం.. చివరకు పోలీసులను ఆశ్రయించి..

ABN , First Publish Date - 2022-08-03T01:04:18+05:30 IST

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ దాని వలన అనర్థాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి.

Cyber Crime: వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడినందుకు రూ.25 లక్షలు మాయం.. చివరకు పోలీసులను ఆశ్రయించి..

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ దాని వలన అనర్థాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులే కాదు.. బాగా చదువకుని పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా మోసాలకు (Cyber crime) గురవుతున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌కు (Bhubaneshwar) చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ ఇంజినీర్ (BSNL Engineer) తాజాగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి రూ.25 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

Viral News: గ్రాండ్‌గా విడాకుల పార్టీ చేసుకున్న మహిళ.. ఆ పార్టీకి వచ్చిన వెయిటర్‌ను చూసి..


భువనేశ్వర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాధితుడికి కొన్ని రోజుల క్రితం వాట్సాప్ ద్వారా వీడియో కాల్ (Whatsapp video call) వచ్చింది. తెలియని నెంబర్ అయినా ఆ వ్యక్తి ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ఆ వీడియో కాల్‌లో ఒక అమ్మాయి బట్టలు లేకుండా నగ్నంగా నిల్చుని మాట్లాడుతోంది. ఏవేవో కబుర్లు చెబుతోంది. అతను ఆమె ట్రాప్‌లో పడ్డాడు. ఇద్దరూ ఆ తర్వాత కూడా చాలా సార్లు అలా మాట్లాడుకున్నారు. అయితే సైబర్ నేరగాళ్లు ఆ వీడియో కాల్‌ను రికార్డు చేశారు. ఆ వీడియోను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగారు. 


తర్వాతి రోజు ఒక వ్యక్తి ఆ ఇంజినీర్‌కు ఫోన్ చేసి తాను ఢిల్లీ‌లోని సీబీఐ అధికారినని, నీపై అత్యాచారం కేసు నమోదైందని చెప్పాడు. సాక్ష్యంగా తాము రికార్డు చేసిన వీడియో క్లిప్పింగ్‌లను చూపించాడు. రూ.25 లక్షలు ఇస్తే కేసు మాఫీ చేస్తానని చెప్పాడు. భయపడిన బాధితుడు మూడు దఫాలుగా రూ.25 లక్షలను అతనికి చెల్లించాడు. అయినా ఆ వ్యక్తి అంతటితో ఆగలేదు. మరిన్ని డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-08-03T01:04:18+05:30 IST