Viral News: టార్గెట్ రీచ్ కాకపోతే.. ఉద్యోగులు పచ్చి గుడ్లు తాగాల్సిందే.. ఆ కంపెనీ వింత కండిషన్!

ABN , First Publish Date - 2022-08-26T16:32:18+05:30 IST

పని ఆధారంగా సంస్థలు ఉద్యోగులకు వేతనాలు పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటాయి. ఉద్యోగి పర్ఫామెన్స్ బాగుంటే.. ఇంక్రిమెంట్లు, బోనస్‌లో రూపంలో సదరు ఉద్యోగిని మరింత బాగా పని చేసేలా ప్రోత్సహిస్తాయి. అదే పని తీరు బాగాలేని ఉద్యోగికి జీతంలో కోత

Viral News: టార్గెట్ రీచ్ కాకపోతే.. ఉద్యోగులు పచ్చి గుడ్లు తాగాల్సిందే.. ఆ కంపెనీ వింత కండిషన్!

ఇంటర్నెట్ డెస్క్: పని ఆధారంగా సంస్థలు ఉద్యోగులకు వేతనాలు పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటాయి. ఉద్యోగి పర్ఫామెన్స్ బాగుంటే.. ఇంక్రిమెంట్లు, బోనస్‌లో రూపంలో సదరు ఉద్యోగిని మరింత బాగా పని చేసేలా ప్రోత్సహిస్తాయి. అదే పని తీరు బాగాలేని ఉద్యోగికి జీతంలో కోతలు విధిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగం నుంచి కూడా తొలగిస్తూ ఉంటాయి. కానీ ఓ సంస్థ మాత్రం.. నా స్టైలే వేరు అన్నట్టు వ్యవహరిస్తోంది. టార్గెట్ రీచ్ కాలేకపోయిన ఉద్యోగులతో.. విచిత్రంగా పచ్చి గుడ్లు తాగిస్తోంది. వినడానికి వింతగా అనిపించిన ఇది నిజం. ఈ క్రమంలో ఈ విచిత్రమైన నిబంధన పెట్టిన సంస్థ ఏదనే పూర్తి వివరాల్లోకి వెళితే..



చైనా(China)లోని జెంగ్జౌ నగరంలో ఉన్న ఓ టెక్నాలజీ సంస్థ ఈ వింత నిబంధనను పెట్టింది. సంస్థలో ఏ ఉద్యోగైనా తనకు కేటాయించిన టార్గెట్‌ పూర్తి చేయకపోతే.. సదరు ఉద్యోగి పనిష్మెంట్ కింద పచ్చి గుడ్లు తాగాల్సి ఉంటుంది. ఎవరైనా తినలేకపోతే.. వారి ఉద్యోగం ఊడుతుంది. గుడ్లు తాగడం ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. వాటిని తాగకూడదని ఎక్కడైనా రాసి ఉందా?అంటూ సంస్థలోని హెచ్ఆర్ ఎదురు ప్రశ్నిస్తారు. కాగా..  ఆ సంస్థలో పని చేసిన ఉద్యోగే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సదరు సంస్థలో కొన్ని రోజులు ఇంటర్నెషిప్ చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో తనకు అప్పగించిన టార్గెట్‌ను రీచ్ కాలేకపోయానని.. దీంతో పనిష్మెంట్ కింద పచ్చి గుడ్లు తాగాలని(Employees must eat raw eggs) ఉన్నతాధికారులు సూచించినట్టు పేర్కొన్నారు. అయితే.. ఆ పని చేయలేక తాను ఉద్యోగం మానేసినట్టు వెల్లడించారు. కొందరు ఉద్యోగులు కష్టపడి పచ్చి గుడ్లు తాగుతూ.. వాంతులు కూడా చేసుకోవడాన్ని తాను గమనించానని తెలిపారు. దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం Viralగా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.  


Updated Date - 2022-08-26T16:32:18+05:30 IST