Viral Video: చిన్నారిని అనుకరిస్తూ డ్యాన్స్ చేసిన ఏనుగు.. క్యూట్ వీడియోకు నెటిజన్ల ఫిదా!

ABN , First Publish Date - 2022-09-19T01:36:06+05:30 IST

పలు జంతువులకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి.

Viral Video: చిన్నారిని అనుకరిస్తూ డ్యాన్స్ చేసిన ఏనుగు.. క్యూట్ వీడియోకు నెటిజన్ల ఫిదా!

పలు జంతువులకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏనుగులు చేసే సరదా పనులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఏనుగు ఓ చిన్నారిని అనుకరిస్తూ (Elephant Mimics Little Girl) చాలా సరదాగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విటర్‌లో షేర్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. 


ఆ వీడియోలో ఓ పెద్ద ఏనుగు ముందు ఓ చిన్న పాప నిల్చుని క్యూట్‌గా డ్యాన్స్ చేసింది. అది చూసిన ఏనుగు చిన్నారిని అనుకరిస్తూ అంతే క్యూట్‌గా తన చెవులను ఆడించింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఎవరు బాగా డ్యాన్స్ చేశారు అని దీపాంషు అడగ్గా.. ఇద్దరూ బాగా చేశారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. 

Updated Date - 2022-09-19T01:36:06+05:30 IST