Viral Video: తృటిలో తప్పిన ప్రమాదం.. స్కూటీ నుంచి అడవి ఏనుగు ఎలా తప్పించుకుందంటే..

ABN , First Publish Date - 2022-10-15T02:17:52+05:30 IST

ఇటీవలి కాలంలో వన్య మృగాలు తరచుగా రోడ్ల పైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి.

Viral Video: తృటిలో తప్పిన ప్రమాదం.. స్కూటీ నుంచి అడవి ఏనుగు ఎలా తప్పించుకుందంటే..

ఇటీవలి కాలంలో వన్య మృగాలు తరచుగా రోడ్ల పైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. చెట్లను నరికేసి అడవి మధ్య నుంచి రోడ్లు వేయడంతో వన్య మృగాలు స్వేచ్ఛగా సంచరించలేకపోతున్నాయి. రోడ్లు దాటుతున్న క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నాయి. తాజాగా ఓ అడవి ఏనుగు రోడ్డు దాటుతో ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ తన బిడ్డతో స్కూటీపై వెళ్తోంది. అంతలో ఓ ఏనుగు అకస్మాత్తుగా రోడ్డు మీదకు వచ్చేసింది. బైక్‌పై వెళ్తున్న మహిళ ఆ ఏనుగును చూసి షాక్‌కు గురైంది. ఏనుగు కూడా వేగంగా వస్తున్న స్కూటీని చూసి అయోమయానికి లోనైంది. అంతలోనే స్కూటీని తప్పించుకుని రోడ్డు దాటి అడవిలోకి పారిపోయింది. ఈ ఘటనను వెనుక ఉన్న వారు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-10-15T02:17:52+05:30 IST