-
-
Home » Prathyekam » eight year old boy swallowed by giant crocodile while bathing in Chambal river sks-MRGS-Prathyekam
-
shocking:నదిలో ఈత కొడుతున్న బాలుడిని మింగిన crocodile
ABN , First Publish Date - 2022-07-12T14:04:30+05:30 IST
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంబల్ నదిలో ఓ షాకింగ్ ఘటన తాజాగా వెలుగుచూసింది....

భోపాల్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంబల్ నదిలో ఓ షాకింగ్ ఘటన తాజాగా వెలుగుచూసింది. చంబల్ నదిలో 8 ఏళ్ల బాలుడు ఈత కొడుతుండగా పెద్ద మొసలి మింగేసిన ఘటన సంచలనం రేపింది. సోమవారం చంబల్ నదిలో 8ఏళ్ల బాలుడు ఈత కొడుతుండగా మొసలి బాలుడిని నదిలోకి లాక్కెళ్లి మింగేసింది.నది ఒడ్డున ఉన్న స్థానికులు వెంటనే అతని కుటుంబీకులు, బంధువులకు ఫోన్ చేసి కర్రలు, తాడు, వల సహాయంతో మొసలిని పట్టుకున్నారు. గ్రామస్థులు నదిలో నుంచి మొసలిని బయటకు లాగారు.ఇంతలో ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారుల బృందం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. గ్రామస్థుల బారి నుంచి మొసలిని రక్షించేందుకు అధికారుల బృందాలు ప్రయత్నించాయి.
అయితే సోమవారం సాయంత్రం వరకు బాలుడి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. మొసలి కడుపులో బాలుడు బతికే ఉంటాడని అతని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూశారు. మొసలి బాలుడిని బయటకు పంపినప్పుడే దాన్ని వదిలేస్తామని స్థానికులు చెప్పారు. అటవీశాఖ, పోలీసు అధికారులు బాలుడు మరణించాడని చెప్పి ఒప్పించడంతో గ్రామస్థులు మొసలిని ఎట్టకేలకు నదిలోకి విడిచిపెట్టారు.మొత్తంమీద మొసలి బాలుడిని మింగిన ఘటనతో చంబల్ నదీ తీర గ్రామంలో విషాదం అలముకుంది.
