కరెన్సీ కట్టల మధ్యలో అమ్మవారి విగ్రహం.. ఏకంగా రూ.8 కోట్ల డబ్బును ఇలా పరిచేశారు.. జరిగింది ఎక్కడో తెలిస్తే..!

ABN , First Publish Date - 2022-10-05T02:49:16+05:30 IST

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. ద‌స‌రా నవరాత్రి వేడుక‌ల‌ను భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో

కరెన్సీ కట్టల మధ్యలో అమ్మవారి విగ్రహం.. ఏకంగా రూ.8 కోట్ల డబ్బును ఇలా పరిచేశారు.. జరిగింది ఎక్కడో తెలిస్తే..!

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. ద‌స‌రా నవరాత్రి వేడుక‌ల‌ను భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఎంతో ఘ‌నంగా, వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రుల సంద‌ర్భంగా అమ్మ‌వారి అలంక‌ర‌ణ‌లు చాలా ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా ఉంటాయి. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయంలోని అమ్మవారి గర్భగుడిని కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఆల‌యం లోప‌ల ఎటూ చూసినా క‌రెన్సీ నోట్లే క‌నిపిస్తున్నాయి. ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? 


ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాల‌యాన్ని ఏకంగా రూ.8 కోట్ల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలకరించారు. విశాఖపట్నంలోని 135 ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని నవరాత్రుల కోసం రూ.8 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఆలయ గోడలను, నేలను కరెన్సీ నోట్లతో నింపేశారు.  రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లతో ఆలయాన్ని అలంకరించేందుకు వందలాది మంది వాలంటీర్లు నిద్రలేని రాత్రులు గడిపారు. విశేషమేమిటంటే.. అక్క‌డ ఉంచిన కరెన్సీ అంతా కూడా ప్రజల సొమ్ము కావడం విశేషం. పూజ ముగిసిన తర్వాత ఆ డబ్బును ప్రజలకు తిరిగి ఇచ్చేస్తారు.  

Updated Date - 2022-10-05T02:49:16+05:30 IST