-
-
Home » Prathyekam » egyptian student naira ashraf killer hanging live telecast130102156html dnm spl-MRGS-Prathyekam
-
Killer Execution Live Telecast: అతడి మరణ శిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయండి.. ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు..!
ABN , First Publish Date - 2022-07-26T17:52:51+05:30 IST
విద్యార్థిని నైరా అష్రఫ్ హంతకుడి ఉరిశిక్షను...

విద్యార్థిని నైరా అష్రఫ్ హంతకుడి ఉరిశిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఈజిప్టు కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అమ్మాయిలను ఆటబొమ్మలుగా భావించే వారికి ఈ శిక్ష ఉదాహరణగా నిలవాలని కోర్టు పేర్కొంది. నైరా అష్రఫ్ 21 ఏళ్ల యూనివర్సిటీ విద్యార్థిని. జూన్ 20న ఆమెను కత్తితో పొడిచి హత్యచేశాడు. దోషి పేరు మహ్మద్ అదాల్. అతడిని అరెస్టు చేశారు. కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. అతను ఆడాల్ యూనివర్సిటీలో నైరాకు సీనియర్. ఈ ఘటన జరిగిన 3 రోజుల తరువాత అంటే జూన్ 23న జోర్డాన్‌లో ఇమాన్ రషీద్ అనే యువతి హత్యకు గురయ్యింది. ఆమెను క్లాస్‌మేట్ హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రాగానే నిందితుడు తుపాకీతో కాల్చుకుని హత్య చేసుకున్నాడు.
ఈజిప్టు రాజధాని కైరోకు 80 కిలోమీటర్ల దూరంలోని మన్షురాలో నైరా హత్యకు గురయ్యింది. అనంతరం హంతకుడిని అరెస్టు చేశారు. గత నెలలో కోర్టులో విచారణ జరిగింది. మహ్మద్ అదాల్ నేరాన్ని అంగీకరించాడు. ఈ సందర్భంగా అతను తాను నైరాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అమె తిరస్కరించడంతో కోపంతో ఆమెను హత్య చేశానని చెప్పాడు. రెండు రోజుల విచారణ తరువాత కోర్టు అదాల్‌కు మరణశిక్ష విధించింది. ఇక్కడ విశేషమేమిటంటే నైరా హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హంతకుడు ఆజ్ఞ మేరకు అతని స్నేహితుడు ఈ వీడియోను వైరల్ చేశాడు. ఆ తర్వాత ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించారు. అదాల్‌ను ఉరితీయాలని ఆదేశించిన మన్షురా క్రిమినల్ కోర్టు నైరా హంతకుడి మరణశిక్షను ప్రభుత్వ, ప్రైవేట్ టీవీ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ కూడా రాశామని కోర్టు తెలిపింది. కాగా 1998లో కైరోలో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను... ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. వారందరినీ ఉరి తీశారు. దీనిని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.