పెట్రోల్ బంక్‌కు వెళ్లా.. తిరిగొచ్చేసరికి భార్య లేదంటూ ఓ భర్త ఫిర్యాదు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు..!

ABN , First Publish Date - 2022-05-16T21:20:18+05:30 IST

అతను ఈ నెల 13న తన భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.. ఇద్దరూ బైక్ మీద చాలా చోట్ల తిరిగి కలిసి ఫోటోలు దిగారు..

పెట్రోల్ బంక్‌కు వెళ్లా.. తిరిగొచ్చేసరికి భార్య లేదంటూ ఓ భర్త ఫిర్యాదు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు..!

అతను ఈ నెల 13న తన భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.. ఇద్దరూ బైక్ మీద చాలా చోట్ల తిరిగి కలిసి ఫోటోలు దిగారు.. తిరుగు ప్రయాణంలో అతను భార్యను రోడ్డుపై దింపి పెట్రోల్ బంకుకు వెళ్లాడు.. అతను పెట్రోల్ కొట్టించి తిరిగి వెళ్లేటప్పటికి ఆమె అక్కడ లేదు.. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. 


ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన గుల్షన్ అనే యువకుడు తన భార్య నందినీతో కలిసి ఈ నెల 13న విహార యాత్రకు వెళ్లాడు. ఆమెతో కలిసి షాపింగ్‌ చేశాడు. పలు చోట్లకు తిరిగి ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు. తిరిగి వచ్చే సమయంలో అతను భార్యను రోడ్డుపై దింపి పెట్రోల్ బంకుకు వెళ్లాడు. అతను పెట్రోల్ కొట్టించి తిరిగి వెళ్లేటప్పటికి ఆమె అక్కడ లేదు. ఈ కథంతా చెప్పి అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు భర్తనే నిందితుడిగా తేల్చారు. 


సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా గుల్షన్ మీద పోలీసులకు అనుమానం వచ్చింది. గుల్షన్ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు అనుమానించిన పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకొని కఠినంగా విచారించారు. దీంతో భార్యను హత్య చేసినట్టు అంగీకరించాడు. గుల్షన్‌కు నాలుగేళ్ల క్రితం నందినితో వివాహమైంది. వారికి ఇన్నేళ్లుగా పిల్లలు లేరు. మరో పెళ్లి చేసుకుందామనే కారణంతో నందినిని చెరువు దగ్గరకు తీసుకెళ్లి అందులో తోసేశాడు. దీంతో పోలీసులు గుల్షన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Read more