కామెడీ అంటే ఇష్టంతోనే కల్యాణ బంధం...

ABN , First Publish Date - 2022-07-07T13:04:26+05:30 IST

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖ కామెడీ స్టార్ భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్‌ను గురువారం రెండో వివాహం చేసుకున్నారు....

కామెడీ అంటే ఇష్టంతోనే కల్యాణ బంధం...

Punjab CM Bhagwant Mann డాక్టర్ గురుప్రీత్‌‌ల వివాహం నేడు

48 ఏళ్ల మాన్ కు 32 ఏళ్ల గురుప్రీత్‌తో వివాహ బంధం

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖ కామెడీ స్టార్ భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్‌ను గురువారం రెండో వివాహం చేసుకోనున్నారు. 48 ఏళ్ల సీఎం మాన్‌ కుటుంబానికి 32 ఏళ్ల డాక్టర్ గురుప్రీత్‌తో ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది. భగవంత్ మాన్ తల్లి, సోదరి డాక్టర్ గురుప్రీత్‌ను రెండో పెళ్లికి వధువుగా ఎంచుకున్నారని సమాచారం. సీఎం మాన్ పలు సినిమాలు, టీవీ షోలలో హాస్యాన్ని పండించారు.మాన్ కామెడీ  అంటే కాబోయే భార్య డాక్టర్ గురుప్రీత్‌కు ఎంతో ఇష్టమట. దీంతోపాటు పంజాబ్ రాష్ట్రాభివృద్ధి కోసం సీఎంగా మాన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, రాజకీయాలు అంటే కూడా గురుప్రీత్ ను ఉత్తేజపర్చాయని ఆమె సన్నిహిత బంధువులు చెప్పారు.


32 ఏళ్ల గురుప్రీత్ స్వస్థలం హర్యానా కానీ పంజాబ్‌లోని రాజ్‌పురాలో నివసిస్తున్నారు. వ్యవసాయ నేపథ్యం ఉన్న ఆమె తల్లిదండ్రులకు గురుప్రీత్ మూడవ కుమార్తె.ఆమె కుటుంబం వాస్తవానికి హర్యానాలోని పెహోవా పట్టణానికి చెందినది కానీ ఇప్పుడు పంజాబ్‌లోని రాజ్‌పురాలో స్థిరపడింది. గురుప్రీత్ కుటుంబం వారం రోజులుగా చండీగఢ్‌లో ఉంది. గురువారం సీఎం మాన్‌తో గురుప్రీత్ వివాహం నిరాడంబరంగా జరగనుంది. పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్‌లోని సతౌజ్ గ్రామం నుంచి ప్రారంభమైన భగవంత్ సింగ్ మాన్‌ ప్రయాణం 17 సంవత్సరాల వయస్సులో సెలబ్రిటీగా మారారు. కేన్సర్ వ్యాధి కారణంగా తన సోదరుడిని కోల్పోయినప్పుడు మాన్ కు ఏడేళ్ల వయస్సు. 


మాన్ 2011-2012లో రాజకీయాల్లోకి రావడానికి ముందు చాలా సంవత్సరాలు కామెడీ షోలు చేశారు. మాన్ 2014 లో లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. ఆ ఎన్నికలు అతని జీవితానికి మలుపు. ఎన్నికలకు ముందు అతను తన మాజీ భార్య  ఇందర్‌జీత్ కౌర్‌కు వాగ్దానం చేశారు. తాను ఓడిపోతే, తన భార్య ఇందర్‌జీత్ కోరిక మేరకు తన మొత్తం కుటుంబంతో కలిసి అమెరికాకి వస్తానని. కానీ మాన్‌ విజయం సాధించడంతో భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సీఎం మాన్ తన ఆస్తి, డబ్బు మొత్తాన్ని తన మాజీ భార్య, పిల్లలకు ఇచ్చారు.ముఖ్యమంత్రి మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు. 21 ఏళ్ల కుమార్తె సీరత్ కౌర్ మాన్, 17 ఏళ్ల కుమారుడు దిల్షన్ సింగ్ మాన్ అమెరికాలో నివసిస్తున్నారు. అతని పిల్లలిద్దరూ మార్చిలో తన తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు. విడాకుల సమయంలో మాన్ తన తండ్రిని కోల్పోయాడు.భగవంత్ మాన్ తన రెండో పెళ్లితో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించడంతో ప్రముఖుల నుంచి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి.

Read more