Uber driver: దయచేసి నన్ను `అన్నా`, `అంకుల్` అని పిలవొద్దు.. క్యాబ్ డ్రైవర్ విజ్ఞప్తి.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

ABN , First Publish Date - 2022-10-01T00:18:05+05:30 IST

బయటకు వెళ్లడానికి క్యాబ్ లేదా ఆటో ఎక్కినపుడు డ్రైవర్‌ను సాధారణంగా అన్నా అనో, భయ్యా అనో లేదా అంకుల్ అనో పిలుస్తుంటాం.

Uber driver: దయచేసి నన్ను `అన్నా`, `అంకుల్` అని పిలవొద్దు.. క్యాబ్ డ్రైవర్ విజ్ఞప్తి.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

బయటకు వెళ్లడానికి క్యాబ్ లేదా ఆటో ఎక్కినపుడు డ్రైవర్‌ను సాధారణంగా అన్నా అనో, భయ్యా అనో లేదా అంకుల్ అనో పిలుస్తుంటాం. అయితే అలా పిలవడం కొందరికి చిరాకు కలిగిస్తుంది. ముఖ్యంగా చిన్న వయసు వారిని కూడా అంకుల్ అని పిలిచినపుడు వారు ఫీల్ అవుతుంటారు. కారణమేంటో తెలియదు గానీ, ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ (Uber driver) తనను అలా పిలవొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. 


తన కారులోని ముందు సీటు వెనుక భాగంలో `నన్ను భయ్యా లేదా అంకుల్ అని పిలవొద్దు` అని రాశాడు. దానిని ఓ వ్యక్తి ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. `అమ్మాయిలు కారు ఎక్కి భయ్యా అని పిలిచినందుకు మనోడు హర్ట్ అయి ఉంటాడు`, `ఆ రిక్వెస్ట్ అమ్మాయేలకోసమేనా?`, `కొంపదీసి ఆ ఉబర్ డ్రైవర్ అమ్మాయేమో`, `కొందరు యంగ్‌గా కనిపిస్తున్న వాళ్లను కూడా అంకుల్ అని పిలుస్తుంటారు` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  


Updated Date - 2022-10-01T00:18:05+05:30 IST

Read more