Domino's compensation: ఇంటర్వ్యూకు వచ్చిన మహిళకు రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించిన డోమినోస్.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-08-22T00:37:49+05:30 IST

మగవాడి జీతం, అమ్మాయిల వయసు అడగకూడదనది సామెత. పాపం.. ఆ విషయం తెలియక

Domino's compensation: ఇంటర్వ్యూకు వచ్చిన మహిళకు రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించిన డోమినోస్.. కారణమేంటో తెలిస్తే షాక్!

మగవాడి జీతం, అమ్మాయి వయసు అడగకూడదనేది సామెత. పాపం.. ఆ విషయం తెలియక డోమినోస్ పిజ్జా (Domino's pizza)కంపెనీ మేనేజర్ తన దగ్గరకు ఇంటర్వ్యూ కు వచ్చిన అమ్మాయి వయసు అడిగాడు. అందుకు పరిహారంగా ఏకంగా రూ. 3లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఐర్లాండ్‌ (Ireland)లో ఈ ఘటన జరిగింది. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన  జానిస్‌ వాల్ష్‌ అనే మహిళ డోమినోస్‌ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరైంది. 


ఇది కూడా చదవండి..

Independence day: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు బ్రిటిష్ అధికారికి చెంపదెబ్బ.. కారణమేంటో చెప్పిన 108 ఏళ్ల వృద్ధుడు


ఆ ఇంటర్వ్యూలో ఆ మహిళ వయసు గురించి మేనేజర్ ప్రశ్నించారు. ఆమెకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వయసు కారణంగా ఆమె తిరస్కరణకు గురైంది. 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు గల వారికే డోమినోస్ సంస్థ ఉద్యోగాలు ఇచ్చింది. విషయం తెలుసుకున్న వాల్ష్ వయసు వివక్ష కారణంగా తాను ఉద్యోగాన్ని పొందలేకపోయానని ఆవేదన చెందింది. తన ఆవేదనను ఫేస్‌బుక్ ద్వారా డోమినోస్ సంస్థకు తెలియజేసింది. వెంటనే డోమినోస్ మేనేజర్ ఆమెకు క్షమాపణ చెప్పాడు. కానీ, ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు. తనను తిరస్కరించడానికి లింగ వివక్ష కూడా ఓ కారణమని వాల్ష్ గుర్తించింది. ఎందుకంటే 30 ఏళ్లు దాటిన కొందరు పురుషులకు కూడా సంస్థ ఉద్యోగాలు ఇచ్చింది. 


ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత కూడా డోమినోస్ సంస్థ పిజ్జా డెలీవరీ డ్రైవర్ జాబ్స్‌ ప్రకటనను ఇస్తూనే ఉంది. తనకు డ్రైవింగ్‌ వచ్చినప్పటికీ మహిళను కావడం వల్లే ఈ ఉద్యోగం రాలేదని భావించిన వాల్ష్‌ ఐర్లాండ్ ఈక్వాలిటీ కమిషన్‌ను ఆశ్రయించింది. వాల్ష్ అభిప్రాయంతో కమిషన్ ఏకీభవించింది. వ్యాపార సంస్థలన్నీ ఉపాధి కల్పించే విషయంలో సమానత్వాన్ని పాటించాలని, ఉద్యోగులు హక్కులను పరిరక్షించే విషయంలో రాజీ పడకూడదని సూచించింది. వాల్ష్‌కు సదరు డోమినోస్‌ కంపెనీ దాదాపు రూ. 3.7 లక్షలు పరిహారంగా (Domino's pays compensation) చెల్లించాలని స్పష్టం చేసింది. 

Read more