contact lenses: కంటిలో 23 కాంటాక్ట్ లెన్సెస్ మరచిపోయిన మహిళ.. ఆఖరికి హాస్పిటల్‌కు వెళ్తే..

ABN , First Publish Date - 2022-10-14T19:57:00+05:30 IST

ప్రతిరోజూ ఉదయం కాంటాక్ట్ లెన్సెస్ (contact lenses) పెట్టుకోవడం.. రాత్రి పడుకునే ముందు తీసివేయాలనే విషయాన్ని మరచిపోవడం.

contact lenses: కంటిలో 23 కాంటాక్ట్ లెన్సెస్ మరచిపోయిన మహిళ.. ఆఖరికి హాస్పిటల్‌కు వెళ్తే..

ప్రతిరోజూ ఉదయం కాంటాక్ట్ లెన్సెస్ (contact lenses) పెట్టుకోవడం.. రాత్రి పడుకునే ముందు తీసివేయాలనే విషయాన్ని మరచిపోవడం. ఇలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు. ఏకంగా 23 రోజులపాటు కొనసాగించిందో మహిళ. ఫలితంగా 23 కాంటాక్ట్ లెన్సెస్ ఆమె కనురెప్ప కింద  కుప్పగా పేరుకుపోయాయి. అమెరికాకు చెందిన బాధిత మహిళ ఎవరో తెలియదు. కానీ లెన్సెస్‌ తొలగింపు ప్రక్రియను డాక్టర్‌ కేథరినా కుర్టీనా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒళ్లుగగుర్పొడిచేలా ఉంది. 


కాగా ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చూస్తుంటామని డాక్టర్ కుర్టీనా పేర్కొన్నారు. ఉదయాన్నే కొత్త కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుని, రాత్రి తొలగించడం ఆమె మరచిపోయేదని వివరించారు. తన క్లీనిక్‌లో వీటిని తొలగించామని చెప్పారు. ‘ ఒకరి కంటి నుంచి 23 కాంటాక్ట్ లెన్సెస్ బయటకు తీశాం. ఇది రియల్ వీడియో. కాంటాక్ట్ లెన్సెస్‌ ఉంచుకుని నిద్రపోవద్దు’’ అని నెటిజన్లకు ఆమె సలహా ఇచ్చారు. ఈ వీడియోకి ఇన్‌స్టాలో 2.9 మిలియన్లకుపైగా వ్యూస్, 81 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసినవారిలో అధికులు షాకవుతున్నారు. కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. 


ఈ మహిళకు కళ్లద్దాలు ఇవ్వాలని, ఒకపై కాంటాక్ట్ లెన్సెస్ వాడొద్దంటూ ఓ యూజర్ సలహా ఇచ్చాడు. బాధిత మహిళ విషయం ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నాడు. కాగా డాక్టర్ కుర్టీనా  ఈ ప్రక్రియకు సంబంధించిన ఫొటోలతో ప్రత్యేకంగా మరో పోస్ట్‌ పెట్టారు. కాంటాక్ట్ లెన్సెస్ అన్నింటినీ చాలా జాగ్రత్తగా తీసివేశానని, మొత్తం 23 ఉన్నాయని తెలిపారు. ఇందుకోసం మెరుగైన సర్జికల్ పరికరాలు వాడామని ఆమె చెప్పారు. 23 రోజులపాటు కనురెప్పల కిందే ఉండడంతో అవి అతుక్కున్నాయని డాక్టర్ వివరించారు.





Updated Date - 2022-10-14T19:57:00+05:30 IST