Very Scary Laws: వామ్మో.. ఇరాన్‌లో ఇవేం చట్టాలు.. పురుషుల ఆటల్ని చూడొద్దట.. భర్త చనిపోతే..

ABN , First Publish Date - 2022-09-25T20:32:58+05:30 IST

ఇరాన్.. హిజాబ్‌(Hijab)కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో అట్టుడుకుతోంది. యువత ముఖ్యంగా మహిళలు.. రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదనే కారణంతో అరెస్టైన 22ఏళ్ల మహస అమిని టెహ్రాన్ పోలీసుల దెబ్బలకు కారణంగా మరణించడమే అక్కడ ఈ పరిస్థితి కార

Very Scary Laws: వామ్మో.. ఇరాన్‌లో ఇవేం చట్టాలు.. పురుషుల ఆటల్ని చూడొద్దట.. భర్త చనిపోతే..

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్.. హిజాబ్‌(Hijab)కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో అట్టుడుకుతోంది. యువత ముఖ్యంగా మహిళలు.. రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదనే కారణంతో అరెస్టైన 22ఏళ్ల మహస అమిని టెహ్రాన్ పోలీసుల దెబ్బలకు కారణంగా మరణించడమే అక్కడ ఈ పరిస్థితి కారణం. ఈ క్రమంలో ఇరాన్‌(Iran)లో అమలవుతున్న కొన్ని షాకింగ్ చట్టాలూ(Scary Laws in Iran)  ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. 


అమ్మయిల కనీస పెళ్లి వయసు ఎంతంటే..

13ఏళ్ల నిండిన అమ్మాయిలు.. 15ఏళ్లు నిండిన అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయి. ఒకానొక దశలో అమ్మాయిల వివాహ వయసు 9ఏళ్లకు కుదించారు. కానీ ఆ తర్వాత పాత నిబంధననే తిరిగి అమలు చేస్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఇరాన్ మహిళ తన ఇంటి పెద్ద అనుమతితో కేవలం ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అదే అబ్బాయిలు మాత్రం.. ఏకంగా నలుగురు మహిళలను పెళ్లిళ్లు చేసుకోవచ్చు.విడాకుల విషయంలోనూ మహిళలకు స్వేచ్ఛ లేదు..

భర్త మానసిక స్థితి సరిగా లేని సమయంలో లేదా శారీరకంగా ఇబ్బందులు పెడుతుండటం, మత్తుకు బానిసకావడం, జైలు శిక్ష అనుభవిస్తున్న సందర్భాల్లో భార్య విడాకులు కావాలని భావిస్తే కోర్టు గానీ ఖాజీ ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది. పురుషుడికి ఇవన్నీ వర్తించవు. తనకు నచ్చకపోతే సింపుల్‌గా మౌకికంగా తలాక్ చెప్పి భార్యతో బంధానికి పుల్ స్టాప్ పెట్టొచ్చు.


బురఖా లేదా హిజాబ్ ధరించాల్సిందే..

మహిళలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే.. శరీరం కనిపించకుండా కాళ్ల నుంచి ముఖం వరకూ బురఖా లేదా హిజాబ్ తప్పనిసరిగా ధరించాలి. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమించడం కానీ.. హిజాబ్ లేదా బురఖా సరిగా ధరించకపోయినా పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు. దారుణంగా కొడతారు. అంతేకాకుండా ఈ నిబంధన అతిక్రమించిన మహిళలు ఫైన్‌తోపాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. పెళ్లైన మహిళలు భర్త అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదు. 


కుటుంబ పెద్ద మరణిస్తే..

భార్య చనిపోతే ఆమె పేరుపై ఉన్న ఆస్తి మొత్తం భర్త పేరు మీదకు బదిలీ అవుతుంది. అదే భర్త చనిపోతే మాత్రం భార్యకు కేవలం 1/8వంతు ఆస్తి మాత్రమే లభిస్తుంది. తండ్రి మరణానంతరం కుమారుడు తన సోదరితో పోల్చితే రెండొంతుల ఆస్తి ఎక్కువగా పొందుతాడు.స్టేడియానికి వెళ్లి పురుషుల ఆటలు చూడొద్దు..

ఇరాన్ మహిళలు స్వేచ్ఛగా స్టేడియానికి వెళ్లి.. అక్కడ పురుషులకు సంబంధించిన ఆటలను చూడవద్దనే చట్టం 2022 వరకు అమలు జరిగింది. కొద్ది రోజుల క్రితం జరిగిన FIFA వరల్డ్ క్వాలిఫైయర్ మ్యాచ్ సందర్భంగా ఒత్తిడి రావడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తివేసింది. 


డ్యాన్సు చేయడమూ తప్పే..

ఇరాన్ మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో డ్యాన్స్ చేయడానికి వీళ్లేదు. క్లోజ్డ్ ప్రదేశాల్లో కేవలం మహిళలు ఉన్నప్పుడు మాత్రమే డ్యాన్స్ చేయాలి. అంతేకాదు.. ఇరాన్ మహిళలు ఎవరైనా మ్యూజిక్ ఆల్బమ్‌ను లాంచ్ చేయాలని భావిస్తే.. తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. 


ఇరాన్ చట్టాల ప్రకారం.. దత్తత తీసుకున్న కూతురికి పెళ్లి వయసు వచ్చిన తర్వాత తండ్రి ఆమెను పెళ్లి చేసుకోవడం అక్కడ నేరం కాదట. ప్రపంచం అభివృద్ధిలో దూసుకుపోతున్నా.. ఇప్పటికీ ఈ చట్టం అక్కడ అమలవుతోంది. 2013లో ఈ విధానంపై నిషేధం అమలులోకి వచ్చింది. అయితే ఇది ఎంతో కాలం అమలు కాలేదు. ఈ నిషేధంపై గార్డియన్ కౌన్సిల్ వ్యతిరేకించి.. కోర్టు మెట్లెక్కింది. దీంతో అక్కడి కోర్టు తిరిగి ఈ విధానాన్ని అమలు చేయాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Read more