సెల్ఫీల‌లో ఎన్ని ర‌కాలున్నాయో మీకు తెలుసా? మీరు తీసుకునే సెల్ఫీ ఏ కోవ‌లోకి వ‌స్తుందో ఇలా తెలుసుకోండి!

ABN , First Publish Date - 2022-11-30T11:59:07+05:30 IST

మొబైల్ ఫోన్ల వినియోగం పెర‌గ‌డంతో సెల్ఫీల ట్రెండ్ మ‌రింత‌గా పెరిగింది. ప్రతి క్షణం సెల్ఫీ దిగే ట్రెండ్ నడుస్తోంది.

సెల్ఫీల‌లో ఎన్ని ర‌కాలున్నాయో మీకు తెలుసా? మీరు తీసుకునే సెల్ఫీ ఏ కోవ‌లోకి వ‌స్తుందో ఇలా తెలుసుకోండి!

మొబైల్ ఫోన్ల వినియోగం పెర‌గ‌డంతో సెల్ఫీల ట్రెండ్ మ‌రింత‌గా పెరిగింది. ప్రతి క్షణం సెల్ఫీ దిగే ట్రెండ్ నడుస్తోంది. అయితే ఒక్కో సెల్ఫీకి ఒక్కో పేరు ఉంటుందని మీకు తెలుసా? సెల్ఫీల‌లోని ర‌కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్థీ సెల్ఫీ

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చూపిస్తూ తీసుకునే సెల్ఫీని ఆరోగ్యకరమైన సెల్ఫీగా పరిగణిస్తారు. ఉదాహరణకు జిమ్‌లో తీసుకునే సెల్ఫీని లేదా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ తీసుకునే సెల్ఫీని హెల్థీ సెల్ఫీ అని అంటారు.

వ్యాలిడేష‌న్‌ సెల్ఫీ

మీరు స‌రికొత్తగా హెయిర్ కట్ చేసుకున్నారని అనుకుందాం. ఆ హెయిర్‌కట్‌ను అంద‌రికీ ప్రదర్శించడానికి మీరు సెల్ఫీ తీసుకుంటే, దానిని వ్యాలిడేష‌న్‌ సెల్ఫీ అంటారు. అలాగే అద్దంలో మీ కొత్త లుక్‌తో మీరు తీసుకునే సెల్ఫీని వ్యాలిడేషన్ సెల్ఫీ అంటారు.

స్నాప్ హ్యాపీ సెల్ఫీ

ఇది సెల్ఫీ తీసుకునే వ్యక్తి తన భిన్నమైన మానసిక స్థితిని చూపించడానికి ప్రయత్నించే సెల్ఫీ. చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు తరచూ ఇలాంటి సెల్ఫీలు తీసుకుంటారు.

యాంఫిటైజర్ సెల్ఫీ

ఆసుపత్రిలో ఉండి ఇబ్బందులు ప‌డుతూ తీసుకునే సెల్ఫీని యాంఫిటైజర్ సెల్ఫీ అంటారు. ఈ సెల్ఫీని చూసిన తర్వాత బాధితుల‌ను ఇత‌రులు ఓదారుస్తారు.

విక్టరీ సెల్ఫీ

మీరు ఏదైనా సాధించిన‌ట్ల‌యితే విక్టరీ గుర్తుతో మీరు తీసుకునే సెల్ఫీని విక్టరీ సెల్ఫీ అంటారు.

Updated Date - 2022-11-30T11:59:11+05:30 IST