కట్నం ఇవ్వలేదని పెళ్లయిన 8 నెలల్లోనే విడాకులిచ్చిన భర్త.. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈమె రేంజ్ ఏంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2022-05-12T23:33:08+05:30 IST

అందరమ్మాయిల్లాగే ఆ యువతి కూడా నాన్న కూచీనే. ఆమెను తండ్రి ఎంతో గారాబంగా పెంచాడు. పెళ్లీ వయసు వచ్చాక ఓ సంబంధం చూశాడు. తండ్రి చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఆమె ఓకే చెప్పేసింది.

కట్నం ఇవ్వలేదని పెళ్లయిన 8 నెలల్లోనే విడాకులిచ్చిన భర్త.. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈమె రేంజ్ ఏంటో తెలిస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: అందరమ్మాయిల్లాగే ఆ యువతి కూడా నాన్న కూచీనే. ఆమెను తండ్రి ఎంతో గారాబంగా పెంచాడు. పెళ్లీ వయసు వచ్చాక ఓ సంబంధం చూశాడు. తండ్రి చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఆమె ఓకే చెప్పేసింది. దీంతో అంగరంగా వైభవంగా వివాహం జరిగింది. ఎంతో ఆనందంగా భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టింది. పెళ్లైన తొలిరోజుల్లో అంతా బాగానే ఉంది. ఆ తర్వాతే అదనపు కట్నం కోసం ఆ యువతికి వేధింపులు మొదలయ్యాయి. పెళ్లైన ఎనిమిది నెలలకు భర్త విడాకులు ఇవ్వడంతో మానసికంగా కుంగిపోయింది.  కట్ చేస్తే.. ప్రస్తుతం ఆమె రేంజ్ ఊహించనంత మారిపోయింది. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మధుమిత.. ఓ గిరిజన యువతి. Jharkhandలోని జంషడ్‌పూర్‌కు చెందిన ఈమెకు.. తండ్రి చూసిన అబ్బాయితో 2012లో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఆమెకు ఇబ్బందులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం అత్త వేధిస్తే.. భర్త కూడా తల్లికే సపోర్ట్ చేయడంతో షాకైంది. ఖరీదైన కోరికలు కోరడం వల్ల ఆమె తండ్రి కూడా చేతులెత్తేశాడు. దీంతో పెళ్లైన ఎనిమిది నెలలకే మధుమతికు భర్త విడాకులు ఇచ్చేశాడు. ఈ క్రమంలో పుట్టింటికి చేరిన ఆమె.. Depressionలోకి వెళ్లిపోయింది. కాలం గడిచే కొద్ది కొద్దిగా డిప్రెషన్ నుంచి తేరుకున్న ఆమె.. సొంతంగా ఏదైనా చేయాలని భావించింది. 



ఈ క్రమంలోనే జంషడ్‌పూర్‌లోని రోడ్లపై చెక్కతో తయారు చేసిన కీ చెయిన్‌లను చూసి ఆసక్తి కనబర్చింది. వాటిని ఎలా తయారు చేస్తారో నేర్చుకుని.. క్రమంగా మరో ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చింది. కేవలం రూ. 5వేల‌తో కీ చైన్స్, నేమ్‌ప్లేట్స్‌ను తయారు చేస్తూ.. బిజినెస్ చేసింది. క్రమంగా కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకుని వారి కావాల్సిన చెక్క బొమ్మలను తయారు చేసి అందించడం ప్రారంభించింది. 2015లో జంషడ్‌పూర్‌లో చెక్క బొమ్మలకు సంబంధించిన మొదటి ఔట్‌లెట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ ఔట్‌లెట్‌లు జార్ఖండ్‌లోని తొమ్మిది నగరాల్లోకి విస్తరించాయి. 220 మంది వర్కర్‌లతో దాదాపు 200 రకాల ప్రొడక్ట్‌లను తయారు చేస్తున్న మధుమిత.. నెలకు రూ.5లక్షల బిజినెస్ చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 200 మంది గిరిజన మహిళలకు పని కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రోజుకు రెండు పూటలు తినడానికి ఇబ్బంది పడే మహిళలు.. ఇపుడు నెలకు రూ. 8-10వేలు సంపాదించడమే కాకుండా వారి పిల్లలను పాఠశాలకు కూడా పంపుతున్నారని చెప్పారు. 


Read more