రోడ్డు పక్కన పాడుబడ్డ ఇంట్లోకి ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు.. ఓ గదిలో కనిపించిన దృశ్యం చూసి షాక్.. భయంతో కేకలు వేస్తూ బయటకొచ్చి..!

ABN , First Publish Date - 2022-07-20T21:47:03+05:30 IST

ఆ పిల్లలు ఆడుకుంటూ రోడ్డు పక్కన ఉన్న పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లారు.. ఆ ఇంట్లోని ఓ గదిలో కనిపించిన దృశ్యం చూసి షాకైపోయారు.

రోడ్డు పక్కన పాడుబడ్డ ఇంట్లోకి ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు.. ఓ గదిలో కనిపించిన దృశ్యం చూసి షాక్.. భయంతో కేకలు వేస్తూ బయటకొచ్చి..!

ఆ పిల్లలు ఆడుకుంటూ రోడ్డు పక్కన ఉన్న పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లారు.. ఆ ఇంట్లోని ఓ గదిలో కనిపించిన దృశ్యం చూసి షాకైపోయారు.. ఆ ఇంటి పై కప్పునకు ఓ యువతి మృతదేహం వేలాడుతూ కనిపించింది.. వెంటనే భయంతో కేకలు వేస్తూ బయటకు వచ్చి పెద్దలకు చెప్పారు.. అందరూ లోపలికి వెళ్లి చూసి ఆ యువతి మృతదేహాన్ని కిందకు దించారు.. సోమవారం ఇంటి నుంచి అదృశ్యమైన 18 ఏళ్ల యువతి రంజన కుమారిగా గుర్తించారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బీహార్‌లోని శివన్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

అమ్మాయిల పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి అసభ్యకరంగా చాటింగ్.. ఇప్పుడు ఈ కుర్రాడి పరిస్థితి ఏంటంటే..


శివన్‌కు సమీపంలోని హర్ దోబారా గ్రామానికి చెందిన కృష్ణ సింగ్ కుమార్తె 18 ఏళ్ల రంజన కుమారి సోమవారం సాయంత్రం తన ఇంటి నుంచి అదృశ్యమైంది. అప్పట్నుంచి ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న శిథిలమైన ఇంటి లోపల పైకప్పునకు వేలాడుతున్న ఆమె మృతదేహం మంగళవారం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శివన్ ఆసుపత్రికి తరలించారు.


ప్రేమ వ్యవహారం వల్లే ఆ యువతి ఉరి వేసుకుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడిందని, వివాహానికి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడంతో ఆవేశానికి లోనైన యువతి ఉరి వేసుకుని చనిపోయిందని అంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ప్రేమ వార్తలను కొట్టిపారేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Read more