శవ వేషధారణలో మొక్కు తీర్చుకున్న భక్తుడు

ABN , First Publish Date - 2022-04-10T14:29:22+05:30 IST

సేలం జిల్లా జోరికొండాలంపట్టిలో ప్రసిద్ధిచెందిన మారియమ్మన్‌ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కోర్కెలు తీరిన

శవ వేషధారణలో మొక్కు తీర్చుకున్న భక్తుడు

పెరంబూర్‌(చెన్నై): సేలం జిల్లా జోరికొండాలంపట్టిలో ప్రసిద్ధిచెందిన మారియమ్మన్‌ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కోర్కెలు తీరిన భక్తులు తమ మొక్కలు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో కోరిక తీరిన ఓ భక్తుడు తాను మొక్కకున్న విధంగా శవయాత్రతో వచ్చాడు. మృతిచెందిన వ్యక్తికి చేసినట్లే బంధువులు, మిత్రులు అశ్రునయనాల నడుమ అతడిని శ్మశానానికి తరలించారు. అక్కడ ఓ కోడికి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం సదరు శవం వేషధారి భక్తుడు ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాడు. 


Read more