పెళ్లి జరిగిన తర్వాతి రోజే బయటపడిన షాకింగ్ విషయం.. పోలీసులను ఆశ్రయించిన యువతి కుటుంబం

ABN , First Publish Date - 2022-07-12T22:03:37+05:30 IST

ఆ యువతికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది..

పెళ్లి జరిగిన తర్వాతి రోజే బయటపడిన షాకింగ్ విషయం.. పోలీసులను ఆశ్రయించిన యువతి కుటుంబం

ఆ యువతికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది.. పెళ్లి జరిగిన తర్వాతి రోజే ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది.. తన భర్త శారీరకంగా, మానసికంగా అనారోగ్యంతో ఉన్నట్టు తెలుసుకుంది.. అంత పెద్ద విషయం దాచి పెళ్లి చేసినందుకు అత్తమామలను నిలదీసింది.. దీంతో అత్తింటి వారు ఆమెను వేధించడం ప్రారంభించారు.. ఎనిమిది నెలలు ఎలాగో సర్దుకుపోయిన ఆ మహిళ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. 


ఇది కూడా చదవండి..

మైనర్ బాలుడితో మహిళ Affair.. రాత్రి సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో..


హర్యానాలోని పానిపట్ జిల్లా సమల్కా పట్టణానికి చెందిన యువతికి గతేడాది అక్టోబర్‌లో గురుగ్రామ్‌లోని యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అత్తింటికి చేరుకున్న ఆ యువతికి షాకింగ్ విషయం తెలిసింది. తన భర్త శారీరక, మానసిక వ్యాధిగ్రస్తుడని తెలుసుకుంది. అతడి జననాంగానికి ఆపరేషన్ జరిగిందని, అతను లైంగికంగా ఫిట్‌గా లేడని తెలిసింది. తనను మోసం చేసిన అత్తమామలను నిలదీసింది. దీంతో వారు ఆమెను వేధించడం ప్రారంభించారు. 


ఆ యువతిని పలుసార్లు అత్తమామలు కొట్టారు. దీంతో ఆ యువతి తన తల్లిదండ్రులకు మొత్తం విషయం చెప్పింది. దీంతో మళ్లీ ఆ యువతిని వారు కొట్టారు. ఆ యువతికి సంబంధించిన నగలు, డబ్బులు దాచేశారు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Read more