Tamil Nadu: బస్టాండ్‌లోనే 16 ఏళ్ల అమ్మాయి మెడలో తాళికట్టిన 17ఏళ్ల బాలుడు.. వీడియో హల్‌చల్‌!

ABN , First Publish Date - 2022-10-12T21:09:48+05:30 IST

తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం బస్టాండ్‌లో ఓ బాలుడు అందరూ చూస్తుండగానే బాలిక మెడలో తాళి కట్టాడు

Tamil Nadu: బస్టాండ్‌లోనే 16 ఏళ్ల అమ్మాయి మెడలో తాళికట్టిన 17ఏళ్ల బాలుడు.. వీడియో హల్‌చల్‌!

తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం బస్టాండ్‌లో ఓ బాలుడు అందరూ చూస్తుండగానే బాలిక మెడలో తాళి కట్టాడు. ఆ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారడంతో పోలీసులు స్పందించారు. బాలుడిని అరెస్టు చేసి జువైనల్ అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. అలాగే మైనర్ బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయానికి  కౌన్సెలింగ్ కోసం తీసుకెళ్లారు. పెళ్లి చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.


ఇది కూడా చదవండి..

Elon Musk: కొత్త పెర్ఫ్యూమ్ లాంఛ్ చేసిన ఎలన్ మస్క్.. ఒక్కో బాటిల్ ధర ఎంతంటే..


విద్యార్థిని ఇంటర్మీడియెట్ చదువుతుండగా, ఆమెకు తాళి కట్టిన విద్యార్థి ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్‌లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. బస్టాండ్‌లో తాళి కట్టే సందర్భంగా విద్యార్థులిద్దరూ యూనిఫామ్స్‌లోనే ఉన్నారు. తోటి విద్యార్థులు వారిపై అంక్షింతలకు బదులుగా కాగితాలు చల్లి అభినందించారు. ఈ ఘటనపై తమిళనాడు సమాజం తీవ్ర ఆగ్రహంగా స్పందిస్తోంది. చిన్న వయసులోనే వారు చేసిన పనిని అందరూ విమర్శిస్తున్నారు. 

Read more