ఆకలితో ఉన్న ఆవు, దూడలకు అతను ఏమి పెడుతున్నాడో చూస్తే... మీకూ నోరూరుతుంది!

ABN , First Publish Date - 2022-10-02T17:17:19+05:30 IST

పానీపూరీలు తినడమంటే మనుషులకే కాదు...

ఆకలితో ఉన్న ఆవు, దూడలకు అతను ఏమి పెడుతున్నాడో చూస్తే... మీకూ నోరూరుతుంది!

పానీపూరీలు తినడమంటే మనుషులకే కాదు పశువులకు కూడా ఇష్టమేమని ఒక వీడియో రుజువు చేస్తోంది. రోడ్డుపై వెళుతున్న ఒక ఆవు, దాని దూడ ఎంతో ఇష్టంగా పానీపూరీలు తింటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎప్పటిదో అయినప్పటికీ, మరోసారి అది సోషల్ మీడియాలో కవర్ అవుతోంది. పానీపూరీ పేరు చెప్పగానే చాలా మందికి నోటిలో నీళ్లు నానుతాయి. అయితే ఇప్పుడు పానీపూరీ రుచిని ఆవులు కూడా అమితంగా ఇష్టపడుతున్నాయి. 


ఈ ఆసక్తికరమైన వీడియోలో ఒక వ్యక్తి ఆవుకు, దాని దూడకు పానీపూరీలు తినిపిస్తూ కనిపిస్తున్నాడు. ఆ ఆవు, దూడ కూడా పానీపూరీలను ఎంతో ఇష్టంగా తింటున్నాయి. ఈ వీడియోను జార్ఖండ్ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ముచ్చటపడిపోతూ, రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2022-10-02T17:17:19+05:30 IST

Read more