అక్క అనుమానమే నిజమైంది.. తమ్ముడి ఆత్మహత్య వెనుక ఉన్న వ్యక్తులను బయటకు లాగింది.. చివరకు..

ABN , First Publish Date - 2022-02-16T17:37:26+05:30 IST

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన యువకుడు గత నెలలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. బంధువులు పోలీసులకు సమాచారం అందించి వెంటనే అంత్యక్రియలు చేసేశారు..

అక్క అనుమానమే నిజమైంది.. తమ్ముడి ఆత్మహత్య వెనుక ఉన్న వ్యక్తులను బయటకు లాగింది.. చివరకు..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన యువకుడు గత నెలలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. బంధువులు పోలీసులకు సమాచారం అందించి వెంటనే అంత్యక్రియలు చేసేశారు.. అయితే ఆ యువకుడి సోదరి మాత్రం తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేదు.. దానికి తోడు బంధువుల ప్రవర్తన ఆమెకు అనుమానం కలిగించింది.. దీంతో వారం రోజుల తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. పోస్ట్‌మార్టమ్‌లో అది హత్య అని తేలింది.. విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. 


జోధ్‌పూర్‌కు సమీపంలోని డెచు గ్రామానికి చెందిన సరాదిన్ ఖాన్ అనే వ్యక్తి గత నెల 27వ తేదీన తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఇంటి పక్కన ఉన్న బంధువులు పోలీసులకు సమాచారం అందించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మృతుడి సోదరి రసౌలీ ఖాన్ అనుమానం వ్యక్తం చేసింది. తన తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎలాంటి కారణాలూ లేవని, అతడి మృతి వెనకున్న కారణాలు బయటపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 


పోస్ట్‌మార్టమ్‌లో సరాదిన్ హత్యకు గురయ్యాడని తేలింది. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. ఆస్థి విషయంలో విభేదాలు తలెత్తడంతో సరాదిన్‌ను అతని చిన్నాన్న కొడుకులు నిసార్, బర్కాత్, అబ్దుల్ చంపేశారని తేలింది. గొంతు నులిమి చంపేసి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు బయటపడింది. ఆ విషయాన్ని వారు పోలీసులు ఎదుట అంగీకరించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Read more