మందు లేనిదే ముద్ద దిగట్లేదు ఈ కోడిపుంజుకు

ABN , First Publish Date - 2022-06-08T00:49:43+05:30 IST

ముంబై: ఒక్కసారి మద్యం అలవాటు మానడం చాలా కష్టం.. మద్యం సేవించే మందుబాబులు ఎలా ఉంటారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. వారికి మందు లేనిది ముద్ద దిగదు..

మందు లేనిదే ముద్ద దిగట్లేదు ఈ కోడిపుంజుకు

ముంబై: ఒక్కసారి మద్యం అలవాటు అయితే మానడం చాలా కష్టం.. మద్యం సేవించే మందుబాబులు ఎలా ఉంటారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. వారికి మందు లేనిది ముద్ద దిగదు.. ఇప్పుడు ఓ కోడిపుంజుకు కూడా ఇదే అలవాటు అయిపోయింది. మందు లేనిదే ముద్ద దిగట్లేదు. ముందు ఉంటేనే ఆహారం తింటోంది. మద్యం లేని రోజే మొత్తానికే తినడం మానేస్తోంది. 


మహారాష్ట్ర భండారా జిల్లాలోని పిప్రీకి చెందిన భావు కాతోరే అనే వ్యక్తి కోళ్లను పెంచుకుంటున్నాడు. ఆయన వద్ద అనేక జాతుల కోళ్లు ఉన్నాయి. అయితే ఒకసారి కోడిపుంజుకు ఏమైందో ఏమో తెలీదు గానీ.. ఆహారం తీసుకోవడం మానేసింది. దీంతో అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబసభ్యులకు ఏం చేయాలో పాలు పోలేదు. ఎంత ప్రయత్నించినా దాణా మాత్రం తినట్లేదు ఆ కోడిపుంజు. దీంతో యజమానికి దానికి నాటుసారా పట్టిచ్చాడు. దెబ్బకు లేచికూర్చుంది ఆ కోడిపుంజు. తర్వాత రోజు కోడిపుంజు నీరసంగా ఉండడం గమనించి నాటూసారా పోసేందుకు చూశాడు.. కానీ ఇంట్లో నాటుసారా అయింది. దీంతో వైన్‌ షాప్‌కు వెళ్లి మద్యం తీసుకొచ్చాడు. అప్పుడు కూడా కోడిపుంజు మళ్లీ లేచి కూర్చుంది. అలా అప్పుడప్పుడు దానికి మద్యం రుచి చూపించాడు ఆ యజమాని.. ఇంకేముందు బాగా అలవాటు పడింది. మందు లేకపోతే ఆహారం తినట్లేదు.. నీళ్లు తాగట్లేదు.. కొన్ని నెలలుగా మద్యానికి బానిసైన కోడి పుంజును ఆ అలవాటు మానిపించలేక యజమానికి సతమతమయ్యాడు. ప్రతినెల ఆ కోడిపుంజు కోసమే ప్రత్యేకంగా 2 వేలు ఖర్చ చేయాల్సొస్తుందని యజమాని తలపట్టుకున్నాడు. 


దానితో మద్యం మాన్పించేందుకు ఓ వెటర్నరీ డాక్టర్‌కు చూపించినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more