Muslim Weddings: వివాహాల్లో డాన్స్ నిషిద్ధం...ముస్లిం మతపెద్దల సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-11-29T07:06:10+05:30 IST

వివాహ వేడుకలపై జార్ఖండ్ ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు....

Muslim Weddings: వివాహాల్లో డాన్స్ నిషిద్ధం...ముస్లిం మతపెద్దల సంచలన నిర్ణయం
Muslim Weddings

ధన్‌బాద్ (జార్ఖండ్): వివాహ వేడుకలపై జార్ఖండ్ ముస్లిం మత పెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం,(Clerics Ban Dance) సంగీతం, బాణసంచా కాల్చడాన్ని(Music, Fireworks) నిషేధిస్తూ జార్ఖండ్ బ్లాక్‌లోని ముస్లిం మతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివాహాల్లో(Muslim Weddings) నృత్యం చేయడం, పాటలు పాడటం,బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ జారీ చేసిన ఆదేశాలు డిసెంబర్ 2వతేదీ నుంచి అమలు చేస్తామని నిర్సా బ్లాక్‌లోని సిబిలిబడి జామా మసీదు హెడ్ ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ తెలిపారు.(Jharkhand)

ఆదేశాలు ఉల్లంఘిస్తే జరిమానా

వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేయడం,సంగీతం ప్లే చేయడం, బాణసంచా కాల్చడం ఇస్లామిక్ వ్యతిరేక పద్ధతులని ముస్లిం మత పెద్దలు చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారికి జరిమానా విధించాలని నిర్ణయించారు.‘‘వివాహాల సందర్భంగా నృత్యం చేయడం, డీజే సంగీతం పెట్టడం బాణసంచా ప్రదర్శనలపై ఏకగ్రీవంగా నిషేధం విధించాం.ఈ ఆర్డర్‌ను ఉల్లంఘించిన వారికి రూ.5,100 జరిమానా విధిస్తాం’’ అని అక్తర్ తెలిపారు.

రాత్రివేళ వివాహాలు వద్దు

వివాహ సమయం శుభప్రదంగా భావించినందున రాత్రి 11 గంటలలోపు వివాహం జరిపించాలని అక్తర్ సూచించారు.‘‘రాత్రి 11 గంటల తర్వాత ఎవరైనా నికాహ్ చేయడానికి ప్రయత్నిస్తే వారికి జరిమానా కూడా విధిస్తాం, నిబంధనలను ఉల్లంఘించిన వారు రాతపూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి ఉంటుంది’’ అని అక్తర్ వివరించారు.

Updated Date - 2022-11-29T07:34:00+05:30 IST