Viral Video: చోరీ చేసిన బైక్ నడుపుకుంటూ వెళ్తున్న దొంగ.. అతనికి ఆ బైక్ యజమాని ఎలాంటి షాక్ ఇచ్చాడంటే..

ABN , First Publish Date - 2022-10-06T02:04:10+05:30 IST

చైన్ స్నాచింగ్‌లు, ఫోన్‌లు, బైక్‌లు, కార్లు చోరీకి గురి కావడం గురించి తరచుగా వింటూ ఉంటాం.

Viral Video: చోరీ చేసిన బైక్ నడుపుకుంటూ వెళ్తున్న దొంగ.. అతనికి ఆ బైక్ యజమాని ఎలాంటి షాక్ ఇచ్చాడంటే..

చైన్ స్నాచింగ్‌లు, ఫోన్‌లు, బైక్‌లు, కార్లు చోరీకి గురి కావడం గురించి తరచుగా వింటూ ఉంటాం. పోలీసులు కేసులు నమోదు చేసుకుని కొందరు దొంగలను పట్టుకుంటారు. అయితే తాజాగా ఒక దొంగ పట్ట పగలు, నడిరోడ్డు మీద ఓ బైక్‌ను చోరీ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బైక్ యజమాని తనతో పాటే మాట్లాడుతూ వస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. చివరకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో ఫన్నీగా మారింది.


ఒక దొంగ పట్ట పగలు, నడిరోడ్డుపై బైక్‌ను చోరీ చేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. వెంటనే అప్రమత్తమైన బైక్‌ యజమాని దొంగను గుర్తించి తన స్నేహితుడితో కలిసి వెంబడించాడు. తన బైక్‌ను చోరీ చేసి తీసుకెళ్తున్న వ్యక్తితో మాటలు కలిపాడు. బైక్ ఎప్పుడు కొన్నారని అడిగాడు. ఆ ప్రశ్నకు దొంగ స్పందిస్తూ.. రెండు వారాల క్రితమే కొన్నానని చెప్పాడు. ఆ తర్వాత యజమాని బైక్ నంబర్ ఎంత అని అడిగాడు. దొంగ నెంబర్ ప్లేట్ చూసేందుకు ప్రయత్నిస్తుండగా ఆ యజమాని నెంబర్ చెప్పాడు. 


ఆశ్చర్యపోయిన దొంగ నెంబర్ మీకు ఎలా తెలుసు? అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి స్పందిస్తూ.. `ఎందుకంటే ఆ బైక్ నాది` అని సమాధానమిచ్చాడు. ఈ సంభాషణ మొత్తాన్ని అతని స్నేహితుడు సెల్‌ఫోన్ ద్వారా రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

Updated Date - 2022-10-06T02:04:10+05:30 IST