Viral Video: వయసు చిన్నదే కానీ, మనసు పెద్దది.. వైరల్ అవుతున్న చిన్నారుల స్ఫూర్తిదాయక వీడియో!

ABN , First Publish Date - 2022-12-06T18:54:10+05:30 IST

రోడ్లపై మ్యాన్‌హోల్స్‌ తెరిచి ఉంచడం, వాటివలన ప్రమాదాలు జరగడం గురించి తరచుగా వింటూ ఉంటాం. అయినా సంబంధిత శాఖ పట్టించుకోదు. అలాగే అదే రోడ్డుపై వెళుతున్న జనాలు కూడా పట్టించుకోరు. మ్యాన్ హోల్ తెరిచి ఉంటే దాని గురించి పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అయితే ఇద్దరు చిన్న పిల్లలు మాత్రం అలా తప్పించుకుని వెళ్లిపోలేదు.

Viral Video: వయసు చిన్నదే కానీ, మనసు పెద్దది.. వైరల్ అవుతున్న చిన్నారుల స్ఫూర్తిదాయక వీడియో!

రోడ్లపై మ్యాన్‌హోల్స్‌ తెరిచి ఉంచడం, వాటివలన ప్రమాదాలు జరగడం గురించి తరచుగా వింటూ ఉంటాం. అయినా సంబంధిత శాఖ పట్టించుకోదు. అలాగే అదే రోడ్డుపై వెళుతున్న జనాలు కూడా పట్టించుకోరు. మ్యాన్ హోల్ తెరిచి ఉంటే దాని గురించి పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అయితే ఇద్దరు చిన్న పిల్లలు మాత్రం అలా తప్పించుకుని వెళ్లిపోలేదు. రోడ్డుపై తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌ను మూసేందుకు ప్రయత్నించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ షేర్ చేసిన ఆ వీడియో ప్రకారం.. రోడ్డు మధ్యలో ఓ మ్యాన్‌హోల్‌ తెరిచి ఉంది. ఎదురుగా ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు. వారు మ్యాన్‌హోల్‌ తెరిచి ఉండడం చూశారు. ఎవరికీ దాని వల్ల ప్రమాదం జరగకూడదని భావించి రోడ్డు పక్కన ఉన్న రాళ్లను తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ చుట్టూ పెట్టారు. చిన్నారులు మ్యాన్ హోల్ చుట్టూ రాళ్లు పెడుతున్న సమయంలో.. రెండు కార్లు ఆ రోడ్డు మీద నుంచి వెళ్లాయి. ఎవరూ కారు ఆపి ఆ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా గమనించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 1.15 లక్షలకు పైగా వ్యూస్‌ను, 10 వేలకి పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. ఆ పిల్లలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2022-12-06T18:54:11+05:30 IST