dangerous: మూవింగ్ ట్రైన్‌లో యువకుల డేంజర్ స్టంట్స్

ABN , First Publish Date - 2022-09-29T15:45:59+05:30 IST

మూవింగ్ ట్రైన్‌లో యువకుల డేంజర్ స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

dangerous: మూవింగ్ ట్రైన్‌లో యువకుల డేంజర్ స్టంట్స్

చెన్నై(తమిళనాడు): మూవింగ్ ట్రైన్‌లో యువకుల డేంజర్ స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చెన్నైలో కదులుతున్న రైలులో(moving train) ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు(Chennai mens) విన్యాసాలు చేశారు.చెన్నైలో కదులుతున్న రైలులో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు విన్యాసాలు చేస్తున్న వీడియో తాజాగా వెలుగుచూసింది.  రైలు కంపార్ట్‌మెంట్ బయటి భాగంలో ఉన్న రాడ్లను ముగ్గురు యువకులు పట్టుకొని, తలకిందులుగా వేలాడుతూ విన్యాసాలు చేశారు.ఎలక్ట్రిక్ విద్యుత్ స్తంభాలకు వెంట్రుక వాసి దూరంలో యువకులు వేలాడుతూ వెళ్లడాన్ని చూసిన రైలు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. 


ప్రమాదకరమైన స్టంట్ (dangerous stunts)చేసిన యువకులు నేపథ్య సంగీతంతో వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో లైట్ హౌస్ స్టేషన్- బీచ్ స్టేషన్ మధ్య నడుస్తున్న చెన్నై రైలులో తీశారు.ప్రమాదకరమైన స్టంట్లు చేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని రైలు ప్రయాణికులు కోరుతున్నారు. 


Read more