-
-
Home » Prathyekam » chanakya niti parents should not commit such mistakes dnm spl-NGTS-Prathyekam
-
chanakya niti: తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇలా మెలిగితేనే వారికి బంగారు భవిష్యత్తు!
ABN , First Publish Date - 2022-08-07T12:52:21+05:30 IST
పిల్లలు తల్లిదండ్రులను చూసి చాలా నేర్చుకుంటారని...

పిల్లలు తల్లిదండ్రులను చూసి చాలా నేర్చుకుంటారని ఆచార్య చాణక్య తెలిపారు. చాణక్యుడు మన జీవితంలో ప్రతి అంశానికి సంబంధించిన విషయాలను చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు. పిల్లల విజయంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర అని చాణక్యుడు చెప్పాడు. పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి చాలా నేర్చుకుంటారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలను అందించాలి. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలను ఎంతగానో ప్రభావితం చేస్తుందని, అందుకే తల్లిదండ్రులు పిల్లల ముందు ఆదర్శవంతమైన ప్రవర్తనను కలిగివుండాలని చాణక్య తెలిపారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఐదేళ్లు వచ్చేవరకూ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వారికి 10 ఏళ్లు వచ్చాక చెడు అలవాట్ల బారిన పడితే శిక్షించాలని చాణక్యుడు చెప్పాడు. పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాలంటే 16 ఏళ్లు నిండాక వారిని స్నేహితునిగా చూడాలి. ఆచార్య చాణక్యుడు పిల్లలపై మితిమీరిన ప్రేమ, ఆప్యాయత చూపకూడదని తెలిపాడు. దీని వల్ల పిల్లలు మొండిగా తయారవుతారని, ఈ అలవాటు సరైనది కాదని, ఇది తల్లిదండ్రులకు శ్రేయస్కరం కాదని ఆచార్య చాణక్య తెలిపారు. పిల్లలు తప్పు, ఒప్పుల మధ్య తేడాను అర్థం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలని అప్పుడే వారిలో సుగుణాలు వృద్ధి చెందుతాయని చాణక్య తెలిపారు.