chanakya niti: అలాంటి మతాన్ని, గురువును, బంధువును వెంటనే విడిచి పెట్టాలి... లేదంటే జరిగేది ఇదే!

ABN , First Publish Date - 2022-11-29T07:18:57+05:30 IST

ప్రతి వ్యక్తికి మొదటి గురువు అతని తల్లిదండ్రులు. ఆ తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులు. మనిషికి ఎదురయ్యే అనుభవాలు అతని జ్ఞానాన్ని పెంచుతాయి.

chanakya niti: అలాంటి మతాన్ని, గురువును, బంధువును వెంటనే విడిచి పెట్టాలి... లేదంటే జరిగేది ఇదే!

ప్రతి వ్యక్తికి మొదటి గురువు అతని తల్లిదండ్రులు. ఆ తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులు. మనిషికి ఎదురయ్యే అనుభవాలు అతని జ్ఞానాన్ని పెంచుతాయి. గురువు గోవిందుడితో సమానమని చెబుతారు. గురువు లేకుండా శిష్యుడు జ్ఞానం పొందడం అసాధ్యమంటారు. ధర్మాధర్మాలకు సంబంధించిన జ్ఞానం గురువు ద్వారానే లభిస్తుంది. శిష్యుడు తన గురువు విషయంలో ఎంతో భక్తి ప్రపత్తులు చూపాలి. అదేవిధంగా గురువు తనను ఆశ్రయించిన శిష్యులకు సరైన మార్గాన్ని చూపడం అతని కర్తవ్యం అని చాణక్యుడు చెప్పాడు. అయితే జీవితంలో గురువును, స్త్రీని, మతాన్ని, బంధువులను ఎటువంటి సమయాల్లో విడిచిపెట్టాలో ఆచార్య చాణక్య తెలిపారు.

అటువంటి మతానికి...

దయ లేని మతాన్ని విడిచిపెట్టడం మంచిదని చాణక్యుడు తెలిపాడు. మతానికి ఆధారం దయ, కరుణ. ఏ ప్రాణిపైన అయినా కరుణ కురిపించడం మనిషి ప్రాథమిక ధర్మం. ఎప్పుడూ దయతో ఉండే వ్యక్తి ఆనందంగా ఉంటాడు.

అలాంటి గురువుకు...

గురువు శిష్యుడికి సరైన మార్గనిర్దేశం చేస్తాడు. సరైన విద్యతో అతనిని ఉన్నతునిగా మలచేందుకు మంచి, చెడుల మధ్య తేడాను బోధిస్తాడు. అయితే గురువుకు తగిన జ్ఞానం లేకపోతే, అతను శిష్యునికి ఎలా మేలు చేస్తాడని ఆచార్య చాణక్య ప్రశ్నించారు. అటువంటి గురువు దగ్గర విద్యను అభ్యసించడం వల్ల విలువైన కాలాన్ని నష్టపోవడమే కాకుండా భవిష్యత్తును పాడుచేసుకున్నవారవుతారని చాణక్య తెలిపారు. అందుకే అలాంటి గురువును విడిచిపెట్టడం మంచిదని ఆచార్య చాణక్య తెలిపారు.

బంధుత్వాల విషయంలో...

బంధుత్వాలనేవి ప్రేమ, నమ్మకానికి కట్టుబడి ఉంటాయి. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ, ఆప్యాయతలు చూపని బంధువులకు దూరంగా ఉండటం మంచిదని ఆచార్య చాణక్య సూచించారు. అలాంటి బంధువులు పేరుకు మాత్రమే బంధువులుగా ఉంటారు. మీకు కాలం కలసిరానప్పుడు వారు దూరంగా ఉంటారు. మీకు కాలం కలసివచ్చినప్పుడు మీ దగ్గర చేరి, మీ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటారని చాణక్య తెలిపారు.

Updated Date - 2022-11-29T07:18:59+05:30 IST