chanakya niti: ఎంతటి సన్నిహిత మిత్రులకైనా ఈ 5 విషయాలు అస్సలు చెప్పకండి.. లేదంటే జీవితాంతం చిక్కులు వెంటాడుతాయి!

ABN , First Publish Date - 2022-10-01T12:01:18+05:30 IST

భారతదేశపు గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త...

chanakya niti: ఎంతటి సన్నిహిత మిత్రులకైనా ఈ 5 విషయాలు అస్సలు చెప్పకండి.. లేదంటే జీవితాంతం చిక్కులు వెంటాడుతాయి!

భారతదేశపు గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త అయిన ఆచార్య చాణక్య తన జీవన విధానాల ద్వారా మన జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను తెలిపారు. వీటిని అనుసరించడం ద్వారా అనేక ఇబ్బందులను ముందుగానే నివారించుకోవచ్చు. అలాగే సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.

చాణక్య నీతిలో స్త్రీలు, పురుషులకు సంబంధించే వేర్వేరుగా నిర్దిష్ట విధానాలు ఉన్నాయి. పురుషులు తమ విషయంలో కొన్ని విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. లేకపోతే, వారు జీవితాంతం సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. 



వ్యక్తిగత రహస్యాలు

పురుషులు తమ వ్యక్తిగత రహస్యాలను ఎవరిముందూ వెల్లడించకూడదు. వారు కొన్ని విషయాలను తమ సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు. వ్యక్తిగత రహస్యాలను చెప్పిన పక్షంలో జీవితాంతం సమస్యలు వెంటాడుతాయి. 

అవమానం

మీరు ఏ విధమైన అవమానానికి గురైనా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకండి. మీకు ఎదురైన అవమానం గురించి ఇతరులకు చెబితే మీ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుంది. అందుకే మీకు ఎదురైన అవమాల గురించి సన్నిహితులకు లేదా కుటుంబ సభ్యులకు కూడా చెప్పకండి. మీలోనే దాచుకోండి.

భార్యతో గొడవలు

భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణమే అయినప్పటికీ, ఆ విషయాలను ఇతరులకు తెలియజేయవద్దు. మీ సన్నిహితుల ముందు మీ భార్యాభర్తల వ్యక్తిగత విషయాలు చెప్పకండి. లేదంటే మీరు అవమానాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. గొడవలు పడే భార్యాభర్తలకు సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. 

బలహీనతలు

ప్రతి వ్యక్తికి అతని వ్యక్తిత్వంలో కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. మీలోని బలహీనతల గురించి ఎవరికీ చెప్పకండి. అలాకాదని ఎవరికైనా చెబితే వారు మిమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తారు. మీ బలహీనతలను ఉపయోగించుకుంటారు. మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు.

ఆర్థిక పరిస్థితి

మీ ఆర్థిక పరిస్థితుల గురించి ఎవరికీ చెప్పకండి. సమస్యలను అధిగమించేందుకు డబ్బు ఉపయోగపడుతుంది. మీ దగ్గర అధికంగా డబ్బు ఉంటే, అది మీ బంధువులకు తెలిసినప్పుడు, వారు దానిని దొంగిలించడానికి, లేదా మీకు హాని చేసి దానిని సొంతం చేసుకునేందుకు అవకాశాలున్నాయని ఆచార్య చాణక్య హెచ్చరించారు. 



Updated Date - 2022-10-01T12:01:18+05:30 IST