V‏iral Video: బాడీగార్డు‌గా విధులు నిర్వర్తిస్తున్న పిల్లి.. ఆ చిన్నారిని ఎలా చూసుకుంటోందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-10-05T00:37:17+05:30 IST

పిల్లులతో పోల్చుకుంటే కుక్కలే మనుషులకు ఎక్కువ చేరువగా ఉంటాయి

V‏iral Video: బాడీగార్డు‌గా విధులు నిర్వర్తిస్తున్న పిల్లి.. ఆ చిన్నారిని ఎలా చూసుకుంటోందో మీరే చూడండి..

పిల్లులతో పోల్చుకుంటే కుక్కలే మనుషులకు ఎక్కువ చేరువగా ఉంటాయి. కుక్కలే విశ్వాసం గల జంతువులు అని, మనుషులకు రక్షణ కల్పించడంలో అలాంటి జంతువు మరొకటి లేదని అంటుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి చిన్న పిల్లాడిని కాపాడుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. 



@Gabriele Corno అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రకారం.. బాల్కనీ రెయిలింగ్ పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న పసిబిడ్డను ఒక పిల్లి వారిస్తోంది. పిల్లాడు రెయిలింగ్ పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న పిల్లి ఆ చేతులను తీసేస్తోంది. ఆదివారం పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటికి ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పిల్లి ఆ బాలుడిని తల్లిలా కాపాడుతోందని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. 

Updated Date - 2022-10-05T00:37:17+05:30 IST