Viral Video: లైవ్‌లో వార్తలు చదువుతుండగా అడ్డు వచ్చిన ఈగ.. ఆ యాంకర్ ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2022-09-05T02:11:20+05:30 IST

లక్షలాది మంది చూస్తుండగా లైవ్‌లో వార్తలు చదవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు..

Viral Video: లైవ్‌లో వార్తలు చదువుతుండగా అడ్డు వచ్చిన ఈగ.. ఆ యాంకర్ ఏం చేసిందో చూడండి..

లక్షలాది మంది చూస్తుండగా లైవ్‌లో వార్తలు చదవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి.. అయినా వాటిని పట్టించుకోకుండా, తమ భావోద్వేగాలను ప్రదర్శించకుండా ప్రశాంత వదనంతో వార్తలు చదవాల్సి ఉంటుంది..  తాజాగా ఓ యాంకర్‌ లైవ్‌‌లో వార్తలు చదువుతుండగా చిన్న సమస్య ఎదురైంది. అయినా ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించి బులిటెన్‌ కంప్లీట్‌ చేసింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ (Viral Video) అవుతోంది. 


కెనడా(Canada)కు చెందిన గ్లోబల్ న్యూస్ యాంకర్ ఫరా నాజర్(Farah Nasser) లైవ్ బులిటెన్ చదువుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక ఈగ ఎగురుతూ వచ్చి ఆమె నోటిలోకి ప్రవేశించింది. ఆ సమయంలో వార్తలు చదవడం ఆపి బ్రేక్ తీసుకోవడానికి కుదరదు. దీంతో ఫరా నాజర్ ఆ ఈగను మింగేసి (Female Anchor Swallowed a Fly) వార్తలు చదవడం కొనసాగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-09-05T02:11:20+05:30 IST