దసరా ఉత్సవాల్లో ప్రియుడితో కలిసి దొరికిపోయిన సోదరి.. ఆ అన్న తీసుకున్న వింత నిర్ణయంతో ఊహించని పరిణామం..!

ABN , First Publish Date - 2022-10-07T00:23:09+05:30 IST

ఆ యువతి చాలా కాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది.. దసరా ఉత్సవాల సందర్భంగా తన ప్రియుడితో కలిసి తిరుగుతోంది..

దసరా ఉత్సవాల్లో ప్రియుడితో కలిసి దొరికిపోయిన సోదరి.. ఆ అన్న తీసుకున్న వింత నిర్ణయంతో ఊహించని పరిణామం..!

ఆ యువతి చాలా కాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది.. దసరా ఉత్సవాల సందర్భంగా తన ప్రియుడితో కలిసి తిరుగుతోంది.. ఆ సమయంలో తన సోదరుడికి దొరికిపోయింది.. అయితే ఆ వ్యక్తి తన సోదరిని, ఆమె ప్రియుడిని పోలీసులకు అప్పగించాడు.. పోలీసులు వారిద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లి మాట్లాడారు.. వారిద్దరి అభిప్రాయం తెలుసుకున్నారు.. వారి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడి వెంటనే ఆ జంటకు గుళ్లో పెళ్లి చేశారు.. బీహార్‌లోని మోతిహరిలో ఈ ఘటన జరిగింది. 


మలాహి గ్రామానికి చెందిన కల్పన అనే యువతి తన పక్క గ్రామానికి చెందిన రాహుల్‌తో రహస్యంగా ప్రేమాయణం సాగిస్తోంది. దుర్గాపూజను చూసేందుకు కల్పన, రాహుల్ జాతరకు వెళ్లారు. అక్కడ ఉన్న కల్పన సోదరుడికి దొరికిపోయారు. కల్పన సోదరుడు వారిద్దరి గురించి జాతరలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కల్పన, రాహుల్‌లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారితో మాట్లాడారు. తామిద్దరం మేజర్లమని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని రాహుల్, కాల్పన పోలీసులకు చెప్పారు. 


పోలీసులు వారిద్దరి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. రెండు కుటుంబాల వారితోనూ మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. అనంతరం ఓ గుడిలో ఇరు కుటుంబ సభ్యుల మధ్య కల్పన, రాహుల్‌కు వివాహం జరిపించారు. వివాహం తర్వాత కల్పన నేరుగా రాహుల్ ఇంటికి వెళ్లిపోయింది. 

Read more