Viral Video: పెళ్లి తర్వాత బహుశా ఇలా ఏ పెళ్లి కొడుకూ చేసుండడేమో... కేవలం పెళ్లికే ఇలా అయితే ఎలా అంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-09-23T01:44:58+05:30 IST

వివాహం.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసే గొప్ప వేడుక. యువతీ, యువకులు పెళ్లి వేడుక ద్వారానే నూతన జీవితంలోకి అడుగుపెడతారు. వివాహానికి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నందువల్లే ప్రస్తుత కాలంలో యువత.. ఈ వేడకను

Viral Video: పెళ్లి తర్వాత బహుశా ఇలా ఏ పెళ్లి కొడుకూ చేసుండడేమో... కేవలం పెళ్లికే ఇలా అయితే ఎలా అంటున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: వివాహం.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసే గొప్ప వేడుక. యువతీ, యువకులు పెళ్లి వేడుక ద్వారానే నూతన జీవితంలోకి అడుగుపెడతారు. వివాహానికి ఇంతటి ప్రాముఖ్యత ఉన్నందువల్లే ప్రస్తుత కాలంలో యువత.. ఈ వేడకను ఘనంగా జరుపుకొంటున్నారు. తీపి గుర్తులను మరింత మధురంగా మల్చుకుంటున్నారు. హిందూ వివాహ వేడుక అంటే.. మాటలు కాదు. పెళ్లి రోజున వధూవరులు.. ఉదయం నుంచి పెళ్లైయ్యేంత వరకు ఏమీ తినకుండా వివాహ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే..



వివాహ వేడుక(Wedding Celebration) కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన ఓ వరుడు(Groom).. బంధు, మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో తనకు నచ్చిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అయితే.. పెళ్లి తంతు పూర్తయ్యే వరకు బాగానే ఉన్న ఆ పెళ్లి కొడుకు అకస్మాత్తుగా డీలా పడిపోయాడు. వేడుక సందర్భంగా ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో.. బాగా నీరసించిపోయాడు. కనీసం ఆహారం తినే స్థితిలో కూడా లేకుండా.. ఆ ప్రాంగణంలో ఉన్న ఓ సోఫాలో కూలబడిపోయాడు. దీంతో భర్త పరిస్థితి చూసి నవవధువు(Bride) చలించిపోయింది. ఇదే సమయంలో దీనికే ఇలానా అన్నట్టుగా నవ్వుతూ.. తన భర్తకు సపర్యలు చేసింది. డ్రైఫ్రూట్స్, జ్యూస్ వంటి ఆహార పదార్థాలను నేరుగా తన నోటికి అందించింది. ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు వీడియో(Video) తీసి సోషల్ మీడియాలో(Social Media) పోస్ట్ చేయడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కేవలం పెళ్లికే ఇలా అయితే ఎలా అంటూ జోకులు పేలుస్తున్నారు. 




Updated Date - 2022-09-23T01:44:58+05:30 IST