నీ కడుపులో ఆడపిల్ల ఉంది.. నేను చెప్పినట్టు వింటే అబ్బాయిగా మార్చేస్తానని 8 నెలల గర్భిణి అయిన భార్యకు చెప్పి..

ABN , First Publish Date - 2022-05-24T17:46:54+05:30 IST

ఆమెకి పది నెలల క్రితం వివాహం జరిగింది.. వివాహం జరిగిన రెండు నెలలకే ఆమె గర్భం దాల్చింది..

నీ కడుపులో ఆడపిల్ల ఉంది.. నేను చెప్పినట్టు వింటే అబ్బాయిగా మార్చేస్తానని 8 నెలల గర్భిణి అయిన భార్యకు చెప్పి..

ఆమెకి పది నెలల క్రితం వివాహం జరిగింది.. వివాహం జరిగిన రెండు నెలలకే ఆమె గర్భం దాల్చింది.. కడుపులో ఆడ పిల్ల ఉందని, తాను చెప్పినట్టుగా పూజలు చేస్తే ఆ ఆడపిల్ల అబ్బాయిగా మారిపోతుందని భర్త చెప్పడంతో ఆమె సరేనంది.. భర్త పర్యవేక్షణలో పూజలు చేసింది.. అయితే ఆ పూజ అనంతరం ఆమె బాల్కనీ నుంచి కింద పడి చనిపోయింది.. పూజ వికటించి భార్య మరణించిందని అతను ఆమె మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేశాడు.. అయితే హతురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

ఇది కూడా చదవండి..

నట్టింట్లో ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు.. పక్కనే బిక్కుబిక్కుమంటూ కూర్చున్న తండ్రి.. ఇంతకీ అసలేం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఉస్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి పది నెలల క్రితం హీనా (23) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన రెండు నెలలకే హీనా గర్భం దాల్చింది. రెండో భార్యను కూడా వదలించుకోవాలనుకున్న ఉస్మాన్ ఆమెను చంపేందుకు స్కెచ్ వేశాడు. ఆమె కడుపులో ఆడపిల్ల పెరుగుతోందని నమ్మేలా చేశాడు. తను చెప్పినట్టు పూజలు చేస్తే కడుపులోని ఆడపిల్ల.. అబ్బాయిగా మారిపోతుందని నమ్మించాడు. మసీదులో ఇమామ్‌ అయిన ఉస్మాన్ మాటలను హీనా నమ్మింది. 


ఈ నెల 12వ తేదీన ఇంట్లోనే భార్యతో కొన్ని పూజలు చేయించాడు. అనంతరం ఆమెను బాల్కనీలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేశాడు. ఎనిమిది నెలల గర్భవతి అయిన హీనా హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపునే మరణించింది. తాను కూడా బాల్కనీ నుంచి పడిపోయానని చెప్పి ఉస్మాన్ కట్లు కట్టించుకున్నాడు. అనంతరం  ఏదో శక్తి తనను, తన భార్యను బాల్కనీ నుంచి తోసేసిందని బంధువులకు చెప్పాడు. భార్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే హీనా తల్లి తన కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు హీనా మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. ఉస్మాన్‌ను అరెస్ట్ చేశారు. 


Read more