-
-
Home » Prathyekam » birthday celebrate in victorian style video got viral-MRGS-Prathyekam
-
Viral Video: క్వీన్ విక్టోరియా మళ్లీ పుట్టిందా..? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..!
ABN , First Publish Date - 2022-10-01T17:25:40+05:30 IST
వీడియో లోో ఉన్న ఒక మహిళ అచ్చంగా క్వీన్ విక్టోరియాలాగానే కనిపిస్తోంది.

క్వీన్ విక్టోరియా గురించి తెలియని వారుండరు కదా. ఆమె చనిపోయి 121 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమె గురించి చెప్పుకుంటున్నామంటేనే ఆమె ఘనత ఏంటో తెలుస్తోంది. అయితే తాజాగా ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తోంటే.. అందులో ఉన్న ఒక మహిళ అచ్చంగా క్వీన్ విక్టోరియాలాగానే కనిపిస్తోంది. అసలు విషయమేమిటంటే క్వీన్ విక్టోరియా స్టైల్ లో అలంకరించుకుని పుట్టినరోజు జరుపుకుందో యువతి. ఇందులో ఆశ్చర్యమేముంది అని అంటారేమో.. ఆమె వయసు అక్షరాలా 89 సంవత్సరాలు. 89 సంవత్సరాల యువతి ఏంటి అనే అనుమానం వస్తుంది అందరికీ. అయితే వయసు శరీరానికే కానీ మనసుకు కాదని ఈ బర్త్ డే క్వీన్ ను చూస్తే అర్థమైపోతుంది.
ఈ 89 సంవత్సరాల బామ్మకు స్నేహా దేశాయ్ అనే ఓ మనవరాలు ఉంది. ఆ మనవరాలు తన బామ్మను క్వీన్ విక్టోరియాలాగా లిలిల్ గౌను, చేతులకు గ్లౌజులు, తలమీద టోపీ, ఫ్రీ హెయిర్ స్టైల్ తో ఎంతో ముచ్చటగా అలంకరించింది. ఆ అలంకరణలోనే బామ్మ కేక్ కూడా కట్ చేసింది. ఇదంతా వీడియో తీసి స్నేహా దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనికి మిలియన్ల కొద్ది వ్యూస్, లక్షల కొద్ది లైక్స్ వచ్చాయి. అంతేనా ఎంతో మంది బామ్మ ముఖంలో కనిపించే సంతోషం వెలకట్టలేనిది అంటూ కామెంట్స్ కూడా చేశారు. క్వీన్ విక్టోరియా మళ్లీ పుట్టిందిగా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.