Bihar: `కండోమ్‌లు కూడా ఉచితంగానే కావాలంటారు`.. బాలికతో అనుచితంగా మాట్లాడిన IAS అధికారిణి..

ABN , First Publish Date - 2022-09-29T02:10:50+05:30 IST

బీహార్‌ (Bihar)లోని పాట్నాలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఐయేఎస్ అధికారి స్పందించిన తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది.

Bihar: `కండోమ్‌లు కూడా ఉచితంగానే కావాలంటారు`.. బాలికతో అనుచితంగా మాట్లాడిన IAS అధికారిణి..

బీహార్‌ (Bihar)లోని పాట్నాలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఐయేఎస్ అధికారి స్పందించిన తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. అమ్మాయిల పట్ల వివక్షతను రూపుమాపడం అనే అంశంపై పాట్నాలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్మన్ హర్జోత్ కౌర్ భమ్రా పాల్గొన్నారు. పాఠశాలలోని విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించారు. ఆమె ప్రశ్నకు ఓ విద్యార్థిని స్పందిస్తూ.. తమ పాఠశాలలోని మరుగుదొడ్ల సమస్య గురించి తెలిపింది. 


ఇది కూడా చదవండి..

పుట్టిన 28 రోజులకే ఘోరం.. మంచంపై నుంచి కిందపడి కూతురు చనిపోయిందంటూ శోకాలు పెట్టిన తల్లి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!


అనంతరం `బాలికలకు 20 లేదా 30 రూపాయలకే ప్రభుత్వం శానిటరీ ప్యాడ్స్ (Sanitary Pads) ఇవ్వొచ్చు కదా` అని అడిగింది. ఆ ప్రశ్న హర్జోత్ కౌర్‌కు అసహనం కలిగించింది. విద్యార్థిని ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. `ప్రభుత్వం జీన్స్ ప్యాంట్లు కూడా ఉచితంగా ఇవ్వాలని రేపు మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన బూట్లు కావాలంటారు. అంతేకాదు గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు (Condoms) కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని మీరు అడుగుతారు` అంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు.


హర్జోత్ స్పందనపై విద్యార్థిని మాట్లాడుతూ.. `ప్రజలు ఓట్లు వేయడం వలనే ప్రభుత్వం ఏర్పడుతుంద`ని చెప్పింది. దీనికి హర్జోత్ స్పందిస్తూ.. `ఇది చాలా మూర్ఖత్వం. అలాగైతే ఓట్లు వేయడం మానేయండి. దేశం పాకిస్థాన్‌లా మారిపోతుంది. మీరు డబ్బుల కోసం ఓట్లు వేస్తున్నారా? మెరుగైన జీవితం కోసమా?` అని ప్రశ్నించారు. బాలిక ప్రశ్నకు హర్జోత్ స్పందించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2022-09-29T02:10:50+05:30 IST