బురఖాతో దసరా మేళాకు యువకుడు... బండారం బయటపడటంతో...

ABN , First Publish Date - 2022-10-06T17:11:50+05:30 IST

ఒకవైపు హిజాబ్, బురఖాపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా...

బురఖాతో దసరా మేళాకు యువకుడు... బండారం బయటపడటంతో...

ఒకవైపు హిజాబ్, బురఖాపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, మరోవైపు బురఖాను అక్రమంగా వినియోగించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. బురఖా అనేది ముస్లిం మహిళల దుస్తులు అయినప్పటికీ, పురుషులు దానిని తమ మారువేషం కోసం ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని బహెడి ప్రాంతంలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడ 164 ఏళ్ల చరిత్ర కలిగిన దసరామేళాను చూసేందుకు ఓ వ్యక్తి బురఖా ధరించి వచ్చాడు. కొందరికి అతనిపై అనుమానం కలగడంతో అతను ధరించిన బురఖాను తొలగించడంతో బండారం బయటపడింది. వెంటనే వారు ఆ యువకుడిని చావబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ యువకుడిని విచారించగా, తాను అల్లా ఆదేశం మేరకే ఇక్కడికి వచ్చానని, అల్లా అనుకుంటే తనకు శిక్ష పడుతుందని, నా ప్రభువుకు నన్ను దండించడం ఇష్టంలేకపోతే ప్రపంచంలో ఎవరూ నన్ను శిక్షించలేరని చెప్పాడు. ప్రస్తుతం ఆ యువకుడిని పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. పట్టుబడిన ఆ యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, అందుకే బురఖా ధరించి జాతరకు వచ్చాడని ఎస్పీ దేహత్ రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. 

Read more