-
-
Home » Prathyekam » Bank manager who sacrificed every thing for love commits suicide sgr spl-MRGS-Prathyekam
-
ఆమె ఓ బ్యాంక్ మేనేజర్.. ఇంట్లో వాళ్లు చెప్పినా వినకుండా పదో తరగతి కూడా చదవని వ్యక్తితో ప్రేమ పెళ్లి.. ఆరేళ్ల తర్వాత చూస్తే..
ABN , First Publish Date - 2022-10-11T20:45:36+05:30 IST
ఆమె ఓ గ్రాడ్యుయేట్.. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయింది..

ఆమె ఓ గ్రాడ్యుయేట్.. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయింది.. అక్కడ ఆమెకు ఓ యువకుడు పరిచయమయ్యాడు.. ఆ కోచింగ్ సెంటర్‌కు వాటర్ క్యాన్‌లు తెచ్చేవాడు.. ఆ యువకుడితో ఆమె ప్రేమలో పడింది.. కష్టపడి చదివి బ్యాంక్ ఉద్యోగం సాధించింది.. ప్రతిభ కనబరిచి బ్యాంక్ మేనేజర్ స్థాయికి ఎదిగింది.. పెద్దలు వద్దన్నా వినకుండా తన ప్రియుడిని వివాహం చేసుకుంది.. ఆరేళ్ల తర్వాత హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
ఇది కూడా చదవండి..
Shocking Video: ప్రశాంతంగా ఉన్న కొలనులో నీరు తాగుతున్న జింక.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని మోహన ప్రాంతానికి చెందిన సుర్బి కుమావత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఇటీవల ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. `అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి. నేను సంతోషంగా లేను. నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు. నా కూతురు జాగ్రత్త` అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సుర్బి పద్నాలుగేళ్ల క్రితం బ్యాంక్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్నప్పుడు షాహిద్ అనే యువకుడితో పరిచయం అయింది. సుర్బి కోచింగ్ సెంటర్‌కు షాహిద్ మంచి నీళ్ల క్యాన్లు అందించేవాడు. ఆరో తరగతి మాత్రమే చదివిన షాహిద్‌తో సుర్బి ప్రేమలో పడింది. కష్టపడి చదివి బ్యాంక్ ఉద్యోగం సాధించింది.
మూడేళ్లలోనే మార్కెటింగ్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. ఇంట్లో పెద్దలను ఎదిరించి షాహిద్‌ను ఆరేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకుంది. వీరికి ఐదేళ్ల కూతురు ఉంది. కాగా, ఇటీవల షాహిద్ ప్రవర్తనలో మార్పు రావడాన్ని సుర్బి తట్టుకోలేకపోయింది. షాహిద్‌కు వేరెవరితోనో వివాహేతర సంబంధం ఉన్నట్టు సుర్బికి అనుమానం కలిగింది. అలాగే పలు విషయాల గురించి షాహిద్ తరచుగా గొడవపడుతుండేవాడు. తను ఎంతగానో ప్రేమించి షాహిద్ తనను ద్వేషించడాన్ని సుర్బి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. కాగా, సుర్బి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు షాహిద్‌ను అరెస్ట్ చేశారు.