new type of tea: గ్రీన్ టీ చూశాం.. అల్లం టీ చూశాం.. లెమన్ టీ చూశాం.. కానీ ఇదేం టీరా నాయనా..

ABN , First Publish Date - 2022-09-29T03:27:31+05:30 IST

చాయ్ ప్రియుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కొత్త రుచుల్లో టీని తయారు చేస్తుంటారు కొందరు. అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మసాలా టీ తదితర రకాలను అందిస్తుంటారు. కొందరు టీ..

new type of tea: గ్రీన్ టీ చూశాం.. అల్లం టీ చూశాం.. లెమన్ టీ చూశాం.. కానీ ఇదేం టీరా నాయనా..

చాయ్ ప్రియుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కొత్త రుచుల్లో టీని తయారు చేస్తుంటారు కొందరు. అల్లం టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మసాలా టీ తదితర రకాలను అందిస్తుంటారు. కొందరు టీ తయారు చేసే పద్ధతే ప్రత్యేకంగా ఉంటుంది. అలాంటి టీ షాపుల వద్దకు జనం క్యూకడుతుంటారు. కొందరైతే.. ఏదో ఒక స్పెషల్ ఉండాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ఆలోచిస్తుంటారు. అలాంటి టీల గురించి సోషల్ మీడియాలో పలు వీడియోలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న టీ తయారీ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన వారంతా.. గ్రీన్ టీ చూశాం.. అల్లం టీ చూశాం.. లెమన్ టీ చూశాం.. కానీ ఇదేం టీరా నాయనా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram videos) అవుతోంది. బంగ్లాదేశ్‌లో టీ దుకాణ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. అతడు చేసిన డ్రాగన్ ఫ్రూట్ చాయ్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముందుగా గ్లాసులో టీపొడితో కూడిన పాలు పోస్తాడు. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ గుజ్జును తీసి, అందులో కలుపుతాడు. చివరగా ఒక చెంచా కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి, మొత్తం మిక్స్ చేస్తాడు. ఫైనల్‌గా వేడి వేడి చాయ్ రెడీ అంటూ కస్టమర్లకు అందిస్తాడు. ఈ కొత్త రకం టీని అంతా లొట్టలేసుకుని మీరీ తాగుతున్నారట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాక్కూడా టీ తయారు చేయొచ్చా.. అంటూ కొందరు..  డ్రాగన్ ఫ్రూట్ చాయ్ ఏంట్రా బాబూ.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. 

King Cobra video: అది కోబ్రా అనుకున్నావా.. లేక జీబ్రా అనుకున్నావా.. మరీ ఇలా ఆడుకుంటున్నావేంట్రా.. 





Updated Date - 2022-09-29T03:27:31+05:30 IST