ఆ బాస్‌ను ఉద్యోగులంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.. కారణం తెలిస్తే మీరూ ‘శభాష్’ అంటారు!

ABN , First Publish Date - 2022-10-01T13:07:10+05:30 IST

ఏ కంపెనీలోని బాస్ అయినా తమ కంపెనీలో...

ఆ బాస్‌ను ఉద్యోగులంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.. కారణం తెలిస్తే మీరూ ‘శభాష్’ అంటారు!

ఏ కంపెనీలోని బాస్ అయినా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ఆఫీసు పనికి గరిష్ట గంటలు ఉండాలని భావిస్తాడు. తద్వారా కంపెనీకి ఎక్కువ ఉత్పాదక లాభం సమకూరుతుంది. అలా అభిలషించడం కూడా తప్పు కాదు. దీని కారణంగా ఉద్యోగులు వారానికి 6 రోజులు ఆఫీసుకు రావడాన్ని కంపెనీ తప్పనిసరి చేస్తుంది. 6 రోజుల సుదీర్ఘ పని తర్వాత, ప్రతి ఉద్యోగికి విశ్రాంతి కోసం ఒక రోజు సెలవు లభిస్తుంది. దీని కోసం ఉద్యోగులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే వారమంతా నిరంతరాయంగా పనిచేయడం అంత సులభం కాదు. సెలవు లభించే సమయానికి దాదాపు ప్రతి ఉద్యోగి అలసిపోతాడు. ఏదైనా కంపెనీ తన సంస్థలోని ఉద్యోగులకు వారానికి 3 రోజులు సెలవులు ఇచ్చి.. 4 రోజులు మాత్రమే ఆఫీసుకు రావాలని చెబితే ఎలా ఉంటుంది? అలా జరిగిత ఇది బాస్ ఔదార్యమని కొనియాడుతారు. బాస్ ఉద్యోగులకు మరింత స్వేచ్ఛ, సౌకర్యాలను ఇవ్వడమనేది కలలో మాత్రమే జరుగుతుందని అనుకుంటారు. అయితే ఓ ఆస్ట్రేలియన్ బాస్ తన ఉద్యోగుల కోసం ఇటువంటి వరాన్ని ప్రసాదించాడు. 


ఆస్ట్రేలియన్ బాస్ డెనిస్ మోరియార్టీలో ఈ ఔదార్యం కనిపించింది. కంపెనీకి మంచి అవుట్‌పుట్ రావాలని అవర్ కమ్యూనిటీ అనే కంపెనీ బాస్ ఈ విధానాన్ని అమలు చేశాడు. దీనివలన ఉద్యోగులపై పని భారం తక్కువగా ఉంటుందని, వారు మరింత సృజనాత్మకంగా, చురుకుగా పని చేయగలుగుతారని బాస్ భావించాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం డెనిస్ మోరియార్టీ ఈ వ్యూహాన్ని 6 నెలల పాటు ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు చెప్పారు. మంచి ఫలితాలు లభించిన పక్షంలో కంపెనీ ఈ విధానాన్ని మరింతకాలం పొడిగించనున్నదని తెలుస్తోంది. కొత్త రూల్‌ కారణంగా కంపెనీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో అధిక సమయం వెచ్చించగలుగుతారు. అలాగే ఆఫీసు పనుల్లో కూడా తమ సృజనాత్మకతను పెంపొందించుకోగలుగుతారని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. 

Read more