పెళ్లయిన మర్నాడే వింత కోరిక.. ఆగ్రహంతో భర్తను రెండ్రోజుల పాటు బంధించిన నవవధువు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-11-19T15:52:59+05:30 IST

ఆ యువతీ యువకులకు నాలుగు రోజుల క్రితం వివాహం జరిగింది. బంధు మిత్రులు, స్నేహితుల మధ్య చాలా సందడిగా పెళ్లి వేడుక పూర్తయింది. పెళ్లి జరిగిన మర్నాడు వధువును వరుడు ఓ కోరిక కోరాడు.

పెళ్లయిన మర్నాడే వింత కోరిక.. ఆగ్రహంతో భర్తను రెండ్రోజుల పాటు బంధించిన నవవధువు.. అసలు కథేంటంటే..

ఆ యువతీ యువకులకు నాలుగు రోజుల క్రితం వివాహం జరిగింది. బంధు మిత్రులు, స్నేహితుల మధ్య చాలా సందడిగా పెళ్లి వేడుక పూర్తయింది. పెళ్లి జరిగిన మర్నాడు వధువును వరుడు ఓ కోరిక కోరాడు. కన్యత్వ పరీక్ష చేయించుకోవాల్సిందిగా సూచించాడు. దీంతో వధువు తీవ్ర ఆగ్రహానికి గురై తన తల్లిదండ్రులకు చెప్పింది. వారందరూ కలిసి వరుడిని, అతడి తండ్రిని, ఇద్దరు సోదరులను పట్టుకుని బంధించారు. రెండ్రోజుల అనంతరం విడిచిపెట్టారు. వధువు మాత్రం వరుడితో వెళ్లేందుకు నిరాకరించింది.

బీహార్‌ (Bihar)లోని మోతిహరీకి చెందిన సూరజ్ బైతా అనే యవకుడు చర్గా గ్రామానికి చెందిన ఓ యువతిని గత బుధవారం వివాహం చేసుకున్నాడు. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత గురువారం ఉదయం వీడ్కోలు సమయంలో సూరజ్ చేసిన డిమాండ్ తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని వధువుకు సూరజ్ సూచించాడు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురై తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

చివరకు వధువు తరఫు వారు వరుడిని, అతని కుటుంబ సభ్యులను తమ ఇంట్లోనే బంధించి ఉంచారు. పోలీసులు, పంచాయతీ పెద్దల మధ్యవర్తిత్వంతో రెండ్రోజుల తర్వాత వారిని వదిలేశారు. అయితే వరుడితో వెళ్లేందుకు వధువు నిరాకరించింది. దీంతో సూరజ్ ఒక్కడే ఒంటరిగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

Updated Date - 2022-11-19T15:53:01+05:30 IST