-
-
Home » Prathyekam » Asia Cup Afghan girl Wazhma Ayoubi to become a huge internet sensation overnight ssr-MRGS-Prathyekam
-
Wazhma Ayoubi: ‘మేడం సార్.. మేడం అంతే’ అనే రేంజ్లో గూగుల్‌లో ఎంతలా వెతికారంటే..
ABN , First Publish Date - 2022-09-14T01:45:12+05:30 IST
ఆసియా కప్ 2022 ముగిసింది. ఫైనల్లో పాకిస్థాన్‌పై నెగ్గి శ్రీలంక విజేతగా నిలిచింది. అయితే.. ఈ టోర్నీ ముగిసినప్పటికీ ఒక యువతికి సంబంధించిన ఫొటో మాత్రం..

ఆసియా కప్ 2022 ముగిసింది. ఫైనల్లో పాకిస్థాన్‌పై నెగ్గి శ్రీలంక విజేతగా నిలిచింది. అయితే.. ఈ టోర్నీ ముగిసినప్పటికీ ఒక యువతికి సంబంధించిన ఫొటో మాత్రం ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఐపీఎల్లో ఈ తరహా ఫ్యాన్ గర్ల్స్ ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఆసియా కప్‌లో కూడా ఇప్పుడు అదే జరిగింది. ఆప్ఘనిస్తాన్ జెండాతో అందంగా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఈమెపైనే అందరి కళ్లు పడ్డాయి.
ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కెమెరామెన్ ఈమెపైకి కెమెరా కళ్లను తిప్పడంతో ‘ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు’ అని కుర్రకారు నెటిజన్లు డ్రీమ్ సాంగ్స్ పాడేసుకున్నారు. ‘గతంలో ఏదైనా అరుదైన ఘనత సాధిస్తేనో, అద్భుతాలు చేస్తేనో వార్తల్లో నిలిచేవాళ్లు.. ఈ మధ్య అందంగా ఉంటే చాలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి వార్తల్లో నిలుస్తున్నారు’ అని సీనియర్ సిటిజన్స్ కమ్ నెటిజన్లు నిట్టూరుస్తున్నారు. ఇంతలా పాపులర్ అయిన ఈ ఆప్ఘన్ ఫ్యాన్ గర్ల్ ఎవరని నెటిజన్లు గూగుల్‌లో వెతుకులాట సాధించారు.
ఆప్ఘన్‌కు చెందిన ఈ మిస్టరీ గర్ల్ పేరు ‘Wazhma Ayoubi’. ఒక స్టూడెంట్‌గా, ఔత్సాహిక వ్యాపారవేత్తగా కెరీర్లో ఎదిగేందుకు దుబాయ్ బాట పట్టింది. ఆ దిశగా 'Laman Clothing' అనే Fashion Label సంస్థను మొదలుపెట్టి తొలి అడుగు వేసింది. ఈ 28 ఏళ్ల ఆప్ఘన్ యువతి ట్విట్టర్లో తన అభిప్రాయాలను, తన దేశ ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షను ఎత్తిచూపుతూ సామాజిక స్పృహ కూడా కలిగి ఉంది. ఆప్ఘనిస్తాన్, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా తన ఫేవరెట్ జట్లు రెండు ఆడుతుండటంతో తన మాతృ దేశానికి మద్దతు తెలపడానికి వెళ్లినట్టు ట్విట్టర్లో ఆఫ్ఘన్ జెండా పట్టుకుని ఫొటో పెట్టి పోస్ట్ చేసింది. ఇదీ ఈ మిస్టరీ గర్ల్ కమ్ ఇంటర్నెట్ ఓవర్‌నైట్ సెన్సేషన్ స్టోరీ.
